• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మొన్న చంద్రబాబుపైన , నేడు సొంత పార్టీ పైన షాకింగ్ కామెంట్స్ చేస్తున్న బీజేపీనేత

|

ఏపీలో బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న చంద్రబాబే మళ్ళీ సీఎం కావాలని వ్యాఖ్యలు చేసిన విష్ణు కుమార్ రాజు తాజాగా మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఏపీలో బీజేపీకి ఒక్క ఎంపీ స్థానం కూడా రాదని ఆ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు తేల్చి చెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందన్న ఆయన ఏపీ విషయంలో, సొంత పార్టీ విషయంలో చేసిన వ్యాఖ్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

చంద్రబాబు డిమాండ్స్ పై మండిపడుతున్న వైసీపీ .. కౌంటింగ్ టీడీపీ ఆఫీస్లో పెట్టమంటాడేమో అని సెటైర్లు

మొన్నటికి మొన్న చంద్రబాబును కలిసి సీఎం కావాలని కోరిన విష్ణు కుమార్ రాజు

మొన్నటికి మొన్న చంద్రబాబును కలిసి సీఎం కావాలని కోరిన విష్ణు కుమార్ రాజు

కేంద్రంలో మోదీని అధికారంలోకి రాకుండా అడ్డుకోడానికి పావులు కదుపుతోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీయేతర పక్షాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మోడీ సర్కార్ ను గద్దె దింపాలని విఫల యత్నాలు చేస్తున్న చంద్రబాబును మొన్నటికి మొన్న బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కలవడం చర్చనీయాంశమైంది. ఏపీ భవన్‌లో చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ఆకాంక్షించారు. స్వయంగా చంద్రబాబు వద్దే ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆయన ‘మీరు మళ్లీ అధికారంలోకి రావాలి సార్‌' అని అంటే .. ఆయన్ని చంద్రబాబు అభినందించారని తెలుస్తుంది.

బాబును గౌరవార్ధం కలిశానని చెప్పిన విష్ణు కుమార్ రాజు

బాబును గౌరవార్ధం కలిశానని చెప్పిన విష్ణు కుమార్ రాజు

ఇక ఏపీ భవన్‌లో బాబును కలిసిన విష్ణుకుమార్ రాజు మీడియాతో వ్యక్తిగత పని కోసం వచ్చానని, చంద్రబాబు కూడా ఇక్కడే ఉండటంతో ఆయన్ని కలిసి వెళ్దామని అనుకున్నాని అన్నారు. అంతే తప్ప, చంద్రబాబును కలవడం వెనుక ఎలాంటి రాజకీయం లేదని చెప్పారు . అలాగే బీజేపీయేతర పక్షాలను చంద్రబాబు ఏకం చేస్తున్న పక్షంలో ఆయన్ని మీరు కలవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయన్న ప్రశ్నకు విష్షుకుమార్ రాజు బదులిస్తూ, ఓ ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాటు బాబుతో కలిసి పనిచేశాను కాబట్టి గౌరవార్ధం ఆయన్ని కలిశానని తెలిపారు. ఒకపక్క చంద్రబాబు అంటే బీజేపీ , బీజేపీ అంటే చంద్రబాబు అగ్గి మీద గుగ్గిలం అవుతున్న తరుణంలో విష్ణు కుమార్ రాజు చంద్రబాబుని కలవటం అలాగే మళ్ళీ సీఎం చంద్రబాబు కావాలని చెప్పటం వంటి అంశాలు ఏపీ బీజేపీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారాయి.

ఏపీలో ఒక్క ఎంపీ స్థానం కూడా బీజేపీ గెలవలేదు అన్న విష్ణు కుమార్ రాజు

ఏపీలో ఒక్క ఎంపీ స్థానం కూడా బీజేపీ గెలవలేదు అన్న విష్ణు కుమార్ రాజు

ఇక తాజాగా ఏపీ ఎన్నికల విషయంలో ఆయన సొంత పార్టీ పైనే వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీకి పెద్ద ఆశాజనకంగా ఉండదన్న విషయం అందరికీ తెలిసిందేనని, కొన్ని స్థానాల్లోనైనా గెలిస్తే బాగుంటుంది కానీ, అది కష్టమని వ్యాఖ్యానించారు. బీజేపీ నేత విష్ణకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాష్ట్రంలో బీజేపీకి మూడు అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని ఆయన జోస్యం చెప్పారు. తనపై పోటీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు కూడ ఓటమి పాలయ్యే అవకాశం ఉందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కానీ ఎంపీ గా ఒక్క స్థానం కూడా దక్కదు అని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ సారి బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందన్న ఆయన బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడంతో బాధపడే వారి సంఖ్య పెరిగిందని ఆయన విమర్శించారు.

English summary
In the AP, the BJP leader Vishnu Kumar raju is making sensational comments. Vishnu Kumar Raju made a strange comment that could shock his own party leaders. "I wish to see Chandrababu Naidu in CM chair once again,(Malli meere CM avvali sir)" said Vishnu Kumar Raju.The party leader Vishnu Kumar said that the BJP does not have a single MP seat in the AP. The comment made in AP has become a hot topic now that the BJP is likely to win more seats across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more