విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో పవన్ కళ్యాణ్ బిజీబిజీ, ప్రఖ్యాత బ్లూమ్‌బర్గ్ ఇంటర్వ్యూ ప్రోమో

|
Google Oneindia TeluguNews

విజయవాడ/వాషింగ్టన్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అయన అక్కడ బిజీబిజీగా ఉన్నారు. పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌లోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీ బెన్ కార్సన్ తదితర ప్రముఖులతో భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో పవన్ వెంట మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు.

కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి, 1996 నుంచి.. ఇదీ చంద్రబాబు!: ఉండవల్లి షాకింగ్ కామెంట్స్కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి, 1996 నుంచి.. ఇదీ చంద్రబాబు!: ఉండవల్లి షాకింగ్ కామెంట్స్

బెన్ కార్సన్‌తో భేటీ

వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు రాబట్టేందుకు గల సాధ్యాసాధ్యాలపై బెన్ కార్సస్‌తో చర్చించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు పవన్ పర్యటనకు సంబంధించిన వివరాలను, ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఆయన వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

గొప్ప అనుభూతి

అమెరికాలో పర్యటిస్తున్న జనసేనాని అక్కడి తన అభిమానులు, మద్దతుదారులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నారు. ముఖ్యంగా నవ్యాంధ్రలో వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై జనసేనాని పలువురు పెట్టుబడిదారులతో చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ స్మారకాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. లూథర్ కింగ్ స్మారకాన్ని దర్శించడం గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు.

మార్టిన్ లూథర్ కింగ్ స్ఫూర్తి

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు. 'కష్టాలను ఓ నాయకుడు ఎలా ఎదుర్కోవాలో, లక్ష్యం దిశగా ధైర్యంగా ఎలా సాగాలో అర్థం చేసుకునేందుకు నేను ఆయన (మార్టిన్ లూథర్ కింగ్) ఆత్మకథను తరచుగా చదువుతుంటాను' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. తనతో పాటు పలువురికి మార్టిన్ లూథర్ కింగ్ స్ఫూర్తిగా నిలిచారన్నారు.

ఇంటర్వ్యూ ప్రోమో


మరోవైపు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బ్లూమ్‌బర్గ్ ఇంటర్వ్యూకు సంబంధించిన ఫోటోలను జనసేన పార్టీ తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేసింది. బ్లూమ్‌బర్గ్ న్యూయార్క్‌లో టాప్ మోస్ట్ ఫైనాన్సియల్ ఎనలిస్ట్. ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను పోస్ట్ చేశారు. న్యూయార్క్‌లోని పోడ్‌కాస్ట్‌లో పవన్, నాదెండ్ల ఉన్న ఫోటోలను కూడా ట్వీట్ చేశారు.

English summary
Bloomberg interviews Jana Sena chief Pawan Kalyan. Now Jana Sena chief in America tour along with former speaker Nadendla Manohar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X