విజయవాడలో 40 వేల ఓట్ల తొలగింపు- పోలింగ్‌ పూర్తయ్యాక- షాకింగ్‌ కారణాలు

విజయవాడ నగర పాలక సంస్ధకు తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతంపై స్ధానిక అధికారులు, ఎస్ఈసీ ప్రకటించిన ఓట్ల శాతాల్లో మార్పులు ఇప్పుడు అభ్యర్ధులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అసలే హోరాహోరీ పోరు, ఆపై పోలింగ్‌ శాతాల లెక్కింపులో తేడాలు, వెరసి ఇప్పుడు ఎవరి కొంప ముంచుతాయో తెలియని పరిస్ధితి. పోలింగ్ ముగిసిన తర్వాత కార్పోరేషన్‌లో 56 శాతం పోలింగ్‌ జరిగిందని ప్రకటించిన ఎస్ఈసీ... ఆ తర్వాత రోజు మాత్రం ఏకంగా 63 శాతం పోలింగ్‌ జరిగిందని ప్రకటించింది. అంతే కాదు పోలింగ్ కంటే ముందు జాబితాలో ఉన్న ఓట్లలో 40 వేల ఓట్లను తగ్గించడం కలకలం రేపుతోంది.

విజయవాడ కార్పోరేషన్‌ ఎన్నికల్లో కలకలం

విజయవాడ కార్పోరేషన్‌ ఎన్నికల్లో కలకలం

విజయవాడ నగర పాలక సంస్ధకు ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. మొత్తం 64 డివిజన్లకు ఇక్కడ పోలింగ్‌ జరిగింది. గతంతో పోలిస్తే మెరుగ్గానే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్‌ శాతం కూడా 60 దాటిపోతుందని అంతా ఊహించారు. కానీ ఎన్నికలు ముగిసిన రోజు సాయంత్రం స్ధానిక ఎన్నికల అధికారులు 58.04 శాతం పోలింగ్‌ జరిగిందని ప్రకటించారు. అయితే కొద్ది సేపట్లోనే ఎస్ఈసీ మాత్రం 56.81 శాతం పోలింగ్ జరిగినట్లు ప్రకటించింది. ఇందులో ఏది కరెక్టో నిర్ధారించుకునే లోపు ఇరువరూ మరో షాకిచ్చారు. అర్ధరాత్రి కల్లా 62.89 శాతం పోలింగ్‌ నమోదైనట్లు స్ధానిక అధికారులు, ఆ తర్వాత ఉదయానికి 63.02 శాతం పోలింగ్ నమోదైందని ఎస్ఈసీ ప్రకటించాయి. దీంతో ఈ పోలింగ్‌ శాతాల్లో ఏది కరెక్టన్న దానిపై గందరగోళం నెలకొంది.

విజయవాడలో మొత్తం ఓట్లపై గందరగోళం

విజయవాడలో మొత్తం ఓట్లపై గందరగోళం

పోలింగ్ శాతాల్లో తేడాలు ఓ ఎత్తయితే అసలు మొత్తం ఓట్ల సంఖ్య ఎంతన్నది మరో సస్పెన్స్‌కు తెరలేపింది. పోలింగ్‌ కంటే ముందు ఎన్నికల అధికారులు గుర్తించిన ఓట్లతో పోలిస్తే పోలింగ్‌ తర్వాత అధికారులు ప్రకటించిన ఓట్ల సంఖ్య ఇప్పుడు తేడాగా ఉంది. దీంతో అసలు విజయవాడలో ఎన్ని ఓట్లున్నాయో తెలియకుండానే అధికారులు పోలింగ్ ప్రక్రియ చేపట్టారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలింగ్‌ శాతాల్లో మార్పుల వెనుక కూడా ఈ ఓట్ల తేడానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. దీంతో ఓట్ల తేడాపై సమాధానం చెప్పలేని పరిస్ధితుల్లో అధికారులు ఉన్నారు.

పోలింగ్‌ తర్వాత 40 వేల ఓట్ల తగ్గింపు

పోలింగ్‌ తర్వాత 40 వేల ఓట్ల తగ్గింపు

విజయవాడ కార్పోరేషన్‌ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందు ఖరారు చేసిన ఓట్ల సంఖ్యతో పోలిస్తే పోలింగ్‌ ముగిశాక తేలిన ఓట్లు 40 వేలు తక్కువగా ఉన్నాయి. దీంతో 40 వేల ఓట్లు ఎందుకు తగ్గాయి, ఏమయ్యాయన్న అంశంపై ఇప్పుడు గందరగోళం నెలకొంది. కార్పోరేషన్‌ ఎన్నికల్లో డివిజన్ల వారీగా ప్రకటించిన ఓట్ల సంఖ్య 7.81 లక్షలు కాగా, పోలింగ్‌ ముగిశాక అధికారులు గుర్తించిన ఓట్లు 7.41 లక్షలే. దీని వల్లే పోలింగ్‌ శాతాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలింగ్‌ కంటే ముందు జాబితాలో ఉన్న 40 వేల ఓట్లను తొలగించడం వల్ల పోలింగ్ శాతాలు కూడా స్ధానిక అధికారులు, ఎస్ఈసీ కూడా మార్చుకోవాల్సిన పరిస్ధితి.

విజయవాడలో ఓట్లు ఎందుకు తగ్గాయంటే ?

విజయవాడలో ఓట్లు ఎందుకు తగ్గాయంటే ?

విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓట్ల తగ్గింపు వ్యవహారం ఇప్పుడు అభ్యర్ధుల్లో గుబులు రేపుతోంది. ఎన్నికల కోసం తయారు చేసిన ఓటర్ల జాబితాలో లోపాలే సమస్యకు అసలు కారణంగా తెలుస్తోంది. పోలింగ్‌కు ముందే ఓటర్ల తుది జాబితా ఖరారు చేసేటప్పుడు ఇళ్ల వద్ద లేని వారు, ఇళ్లు మారిపోయిన వారు, చనిపోయిన వారిని సదరు డివిజన్ల నుంచి తొలగించాల్సి ఉండగా.. అది జరగలేదు. చివరి నిమిషంలో హడావిడిగా వీటిని గుర్తించి తొలగించారు. దీంతో ఓట్ల లెక్కల్లో తేడాలు వచ్చాయి. అయితే ఈ తేడా 40 వేల ఓట్లు కావడంతో అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+