అన్నదాతలు నేరస్థులు కాదు ..జగన్ గారూ అన్న కేశినేని నానీ

ఏపీ సీఎం జగన్ ను కేశినేని నానీ ప్రజా సమస్యలపైన ప్రశ్నిస్తూనే ఉన్నారు . పిచ్చోడి చేతిలో రాయి మీ చేతిలో పాలన అంతే అని జగన్ ను ఉద్దేశించి సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన నానీ ఇప్పుడు అన్నదాతలు నేరస్థులు కాదని వారిని రక్షించాలని జగన్ ను కోరుతూ పోస్ట్ చేశారు.

కేశినేని నాని తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి నానీ సవాల్ విసిరారు. బెంజ్‌సర్కిల్ ఫ్లైఓవర్ జాప్యంపై కేశినేని నాని ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . జగన్‌కు చేతకాకపోతే చెప్పాలని.. తాను చేసి చూపిస్తానని కేశినేని నానీ జగన్ కు చాలెంజ్ చేశారు . ఇక ఈ రోజు అన్నదాతల విషయంలో జగన్ గారూ అంటూ నానీ ట్వీట్ చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ ఎంపీ కేశినేని మరోసారి విమర్శలు చేసిన నానీ కృష్ణా జిల్లా నందిగామలో న్యాయపోరాటం చేస్తున్న రైతులను పోలీసులు కొట్టి వారిని పోలీస్ స్టేషన్ కు లాక్కువెళ్తున్నారని పేర్కొన్నారు. వారిపై దొంగ కేసులు నమోదు చేస్తున్నారన్న సమాచారం తమకు ఉందని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ వెంటనే స్పందించి రైతులను రక్షించాలని, వాళ్లు నేరస్థులు కాదు 'అన్నదాతలు' అని కేశినేని నాని ఓ ట్వీట్ లో జగన్ కు అర్ధం అయ్యేలా చెప్పారు .

Farmers are not criminals .. jagan garu said keshineni nani

ప్రజా సమస్యలను, ప్రతిపక్ష పార్టీల తీరును , అవసరం అనుకుంటే సొంత పార్టీ నేతల తీరును సోషల్ మీడియా వేదికగా అందరికీ అర్ధం అయ్యేలా పోస్ట్ పెడుతున్నారు కేశినేని నానీ. ఇక ఈ పోస్ట్ లే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఎప్పుడు ఎవరు ఏ పోస్ట్ పెట్టి సంచలనానికి తెర తీస్తారో అన్న ఆసక్తి ప్రస్తుతం ఏపీలో ఉంది . అలా ట్రెండ్ ను మార్చేశారు విజయసాయిరెడ్డి, నారా లోకేష్, కేశినేని నానీ వంటి నేతలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+