• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మా భూమినే కృష్ణమ్మ ఆక్రమించింది.. ఆక్రమణ నోటీసుపై బీజేపీనేత గోకరాజు గంగరాజు స్టన్నింగ్ రిప్లై

|

ఏపీ సీఎం జగన్ అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ముందుగా ప్రజా వేదిక ను కూల్చివేశారు. ఇక కృష్ణానది కరకట్ట పై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది. ఉండవల్లిలో కరకట్ట వెంబడి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలోనే కరకట్టపై నిర్మించిన గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ కు సిఆర్‌డిఎ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక తన గెస్ట్ హౌస్ కు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపి గోకరాజు గంగరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో ఆగని దాడులు .. టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి చేసిన వైసీపీ శ్రేణులు

  పలుశాఖలపై సమీక్ష జరుపనున్న సీఎం జగన్
  కృష్ణానది భూమిని తాము ఆక్రమించలేదని తమ భూమినే కృష్ణా నది ఆక్రమించిందన్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు

  కృష్ణానది భూమిని తాము ఆక్రమించలేదని తమ భూమినే కృష్ణా నది ఆక్రమించిందన్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు

  తాము కృష్ణా నది భూమిని ఆక్రమించలేదని తమ భూమినే కృష్ణా నది ఆక్రమించింది అని గోకరాజు గంగరాజు షాకింగ్ కామెంట్ చేశారు. ఇక తన భవనం నిర్మించిన తర్వాతే నదికి వంద మీటర్ల లోపల ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదన్న జీవో వచ్చిందని గుర్తుచేశారు. తాము ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని ఆయన పేర్కొన్నారు. చట్ట ప్రకారమే నడుచుకున్నామని అన్నారు. 25 ఏళ్ల క్రితం నుంచి ఉండవల్లిలో 25 ఎకరాల్లో ఉంటున్నానని చెప్పుకొచ్చిన గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఉడా, ఇరిగేషన్ అనుమతులు ఉన్నాయన్నారు. బిపిఎస్ వచ్చిన తర్వాత అనుమతి కోసం దరఖాస్తు చేశామన్న గోకరాజు అనుమతి రాలేదన్నారు. దీంతో గతంలో ఇరిగేషన్ అధికారులు 30 అడుగులు మాత్రం వదిలి భవనం నిర్మించుకోమని పర్మిషన్ ఇచ్చినట్లుగా గోకరాజు తెలిపారు.

   రాష్ట్ర వ్యాప్తంగా నది వెంబడి ఉన్న అన్ని నిర్మాణాలు కూల్చాలన్న గోకరాజు గంగరాజు

  రాష్ట్ర వ్యాప్తంగా నది వెంబడి ఉన్న అన్ని నిర్మాణాలు కూల్చాలన్న గోకరాజు గంగరాజు

  కృష్ణానదిలో కూడా తమకు భూమి ఉందన్న ఆయన కరకట్టను తాము ఆక్రమించుకోలేదని పేర్కొన్నారు. ప్రజావేదికను కూల్చిన విధంగా అన్నీ కూల్చాలంటే రాష్ట్ర వ్యాప్తంగా నది వెంబడి ఉన్న అన్ని నిర్మాణాలు కూల్చాలని ఆయన పేర్కొన్నారు . తాను కట్టింది విలాసవంతమైన భవనం కాదని చెప్పిన గోకరాజు కేవలం ఫాం హౌస్ మాత్రమే నిర్మించానన్నారు . చిన్న చిన్న పొరబాట్లు అందరూ చేస్తారని, అందరి మీదా చర్యలు తీసుకుంటే మాపైన తీసుకున్నా మాకు అభ్యంతరం లేదన్నారు గోకరాజు. తమకు సిఆర్ డిఎ అధికారులు నోటీసులిచ్చారన్న ఆయన ఆ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం చెప్తామన్నారు.

  గోకరాజు గంగరాజుతో సహా మరో ఐదుగురికి సీఆర్డీయే నోటీసులు

  గోకరాజు గంగరాజుతో సహా మరో ఐదుగురికి సీఆర్డీయే నోటీసులు

  ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణా నది కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలకు నోటీసులు జారీ చేస్తున్న సీఆర్డీఏ ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్‌ హౌస్‌ యజమాని లింగమనేని రమేశ్‌, మంతెన సత్యనారాయణరాజు సహా పలువురికి నోటీసులు జారీచే శారు. ఇక తాజాగా సీఆర్డీఏ మరో అయిదుగురికి నోటీసులు ఇచ్చింది. బిజెపి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తో పాటు నెక్కంటి వెంకట్రావు, వేదాద్రి మహర్షి తపోవనం, దివి సత్యసాయి, అట్లూరి శాంతి చంద్ర లకు చెందిన భవనాలకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు . ఈ అక్రమ కట్టడాలపై వారం రోజుల్లోగా జవాబు చెప్పాలనీ, లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Gokaraju Gangaraju who served as Member of Parliament from Narsapuram has 40-50 acres at different places in Venkatapalem Village. As per buzz, lands come under survey numbers 18-21 belongs to Gokaraju. He also has two guest houses those were constructed just 30 feet away from krishna River. jagan government gave notices to the people who constructed buildings across the krishna River after demolishing the Prajavedika. The reason behind jagan motive is to prove CBN as culprit. Government gave notices for all buildings and gave 10 days time for their reply. Gokaraju gave reply to notice served by YSRCP government in his own style. He said that he didn’t occupy any land near the river. Adding to that, krishna River has occupied his land.As per his version, after construction of the guest house Government issues GO on prohibiting constructions 100 meters away from the krishna River. He said that he didn’t violate the guidelines in the construction of guest houses. Gokaraju confidently said that he gave reply to CRDA within two days.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more