విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడవాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్: బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్‌‌పై ట్రయల్ రన్ షురూ

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడవాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడింది. వారి కల నెరవేరింది. ట్రాఫిక్ కష్టాలు తీరిపోయాయి. నిత్యం వాహన రద్దీతో కిటకిటలాడే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పార్ట్ 2 ఇక అందుబాటులోకి వచ్చింది. ప్రయోగాత్మకంగా ఈ ఫ్లైఓవర్‌పై వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు అధికారులు. దీనితో వాహనాలు రయ్‌మంటూ దూసుకెళ్తోన్నాయి. భారీ వాహనాలు సైతం ఈ ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. వచ్చేనెల లాంఛనప్రాయంగా ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరో ఆఫ్ఘనిస్తాన్: ఇరాక్ ప్రధాని హత్యకు భారీ కుట్ర: నివాసంపై బాంబుల వర్షంమరో ఆఫ్ఘనిస్తాన్: ఇరాక్ ప్రధాని హత్యకు భారీ కుట్ర: నివాసంపై బాంబుల వర్షం

చెన్నై-కోల్‌కత జాతీయ రహదారిపై..

చెన్నై-కోల్‌కత జాతీయ రహదారిపై..

చెన్నై-కోల్‌కత జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించింది. బెంజ్ సర్కిల్ వద్ద నిర్మించిన రెండోె ఫ్లైఓవర్ ఇది. గుంటూరు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే జాతీయ రహదారిపై ఇది రూపుదిద్దుకుంంది. నిర్మల కాన్వెంట్, రమేష్ ఆసుపత్రి మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్తుంది. ఫలితంగా- బెంజ్ సర్కిల్ వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రాత్రివేళల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తుతుంటుంది. ఈ ట్రాఫిక్ గండాన్ని గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం- జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఈ ఫ్లైఓవర్లలను నిర్మించింది.

భారత్‌మాల ప్రాజెక్ట్‌లో భాగంగా..

భారత్‌మాల ప్రాజెక్ట్‌లో భాగంగా..

భారత్‌మాల ప్రాజెక్ట్‌లో ఈ రెండు ఫ్లైఓవర్లు భాగం. 2017లో ఈ రెండింటి నిర్మాణానికి కేంద్రం శంకుస్థాపన చేసింది. ఈ రెండింట్లో ఓ ఫ్లైఓవర్ ఇదివరకే వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. గన్నవరం నుంచి గుంటూరు వైపు వెళ్లే వాహనాలన్నీ ఈ ఫ్లైఓవర్ మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. ఇదే బెంజ్ సర్కిల్ మీదుగా రెండో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా కొద్దిరోజుల కిందటే తుదిదశకు చేరుకున్నాయి. తాజాగా ఈ ఫ్లైఓవర్‌పై ట్రయల్ రన్ మొదలు పెట్టారు.

రూ.90 కోట్లతో..

రూ.90 కోట్లతో..

ఈ ఫ్లైఓవర్ పొడవు.. 2.7 కిలోమీటర్లు. నిర్మాణ వ్యయం సుమారు 90 కోట్ల రూపాయలు. వచ్చే సంవత్సరం మే నాటికి ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అప్పట్లో లక్ష్యంగా నిర్దేశించుకున్నారు అధికారులు. నిర్మాణ పనులు శరవేగంగా సాగాయి. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ముందే నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది ఈ రెండో ఫ్లైఓవర్. దీనితో ట్రయల్ రన్‌ను కూడా మొదలు పెట్టారు. లాంఛనప్రాయంగా వచ్చేనెల ప్రారంభించే అవకాశం ఉంది.

Recommended Video

Andhra Pradesh లో Load Relief కి వేళాయరా.. కోతల వేళలు | Electricity Crisis || Oneindia Telugu

ఇటీవలే పనులను పర్యవేక్షించిన కేశినేని నాని..

తుది దశకు చేరుకున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను కొద్దిరోజుల కిందటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, స్థానిక లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని ఈ ఉదయం సందర్శించారు. టీడీపీకే చెందిన విజయవాడ తూర్పు శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్‌, కృష్ణా జిల్లా రోడ్డు-రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యత పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

English summary
After the completion of the works, heavy vehicles and cars ply on the Benz Circle-II flyover in Vijayawada as part of the trail run.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X