పిచ్చి వాగుడు వాగితే అంతే.. చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైరయ్యారు. అటు నారా లోకేశ్‌పై కూడా విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై పిచ్చి వాగుడు వాగితే అంతు చూస్తామని హెచ్చరించారు. జగన్ దయతో చంద్రబాబు, లోకేశ్ హైదరాబాద్ తిరిగి వెళ్తున్నారని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు నాయుడు తమను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు.
చరిత్రలో నిలిచిపోయేలా సీఎం జగన్ ఒక్కొ నియోజకవర్గాన్ని వెయ్యి కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేస్తున్నారని గుర్తుచేశారు. కానీ ప్రతిపక్షాలకు మాత్రం ఇవేమి కనబడటం లేదన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు మాడు పగిలితే, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వాత పెట్టారని కొడాలి నాని విమర్శించారు. కంకిపాడు రహదారి నిర్మాణ పనులకు మంత్రి కొడాలి నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరి శంకుస్థాపన చేశారు.

గత కొంతకాలంగా చంద్రబాబు లక్ష్యంగా కొడాలి నాని విరుచుకుపడుతున్నారు. లోకేశ్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. పప్పు అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. దీనికి టీడీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. అయితే సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేయడంతో మంత్రి కొడాలి నాని స్పందించారు.












Click it and Unblock the Notifications