రాహుల్ హత్య కేసు: లొంగిపోయిన కోరాడ విజయ్, అందుకే మర్డరా..?

వ్యాపార వేత్త రాహుల్ హత్య కేసులో ఏ1 కోరాడ విజయ్‌ పోలీసుల ముందు లొంగిపోయాడు. హత్య కేసులో ఇప్పటికే విజయ్ భార్య పద్మజ, గాయత్రిను అరెస్ట్ చేశారు. ఏ-4 కోగంటి సత్యంను కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు చెప్పిన అంశాల ఆధారంగా విజయ్ కుమార్ పాత్రపై స్పష్టత వచ్చింది. దీంతో ఆయనపై పోలీసులు ఫోకస్ చేశారు. ఎక్కడ నక్కారా అని ఆరా తీశారు. ఇప్పటికే హత్య కేసు తెలియడం.. పారిపోయేందుకు విజయ్ కుమార్‌కు ఛాన్స్ లేకుండా పోయింది. రాష్ట్రం దాటి వెళ్లే అవకాశమే లేకుండా పోయింది.. దీంతో మాచవరం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు.

లొంగిపోయిన విజయ్..

లొంగిపోయిన విజయ్..

రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదు ఆధారంగా సెక్షన్ 302, 120బి, రెడ్‌విత్‌ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యలో ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోరాడ విజయ్‌తో కలిపి పోలీసులు అదుపులో ఉన్నవారి సంఖ్య ఆరుకు చేరింది. మాచవరం పోలీసుల ముమ్మర విచారణ కొనసాగుతోంది. పద్మజ, గాయత్రి, కోగంటి సత్యం, విజయ్ డ్రైవర్ బాబు, శ్యామ్‌ను అరెస్ట్ చేశారు. ఇవాళ విజయ్ స్వయంగా వచ్చి పోలీసుల ముందు లొంగిపోయాడు.

ఇందుకే హత్య

ఇందుకే హత్య

ఆర్థిక లావాదేవీల వ్యవహారంలోనే పారిశ్రామికవేత్త రాహుల్‌ను హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. నిందితుల కాల్‌ డేటా దర్యాప్తులో కీలకంగా మారింది. కాల్‌డేటాను విశ్లేషిస్తూనే మరోవైపు నిందితుడిగా అనుమానిస్తున్న విజయ్‌కుమార్‌ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం బెంగళూరులో గాలింపు కొనసాగిస్తోంది. కానీ ఇంతలోనే విజయ్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షం అయ్యాడు. అటు రాహుల్‌ను హతమార్చేందుకు సుపారీ కిల్లర్‌తో హత్యకు ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఆ హత్యతో లింక్

ఆ హత్యతో లింక్

గతంలో హైదరాబాద్‌లో జరిగిన వ్యాపారి రాంప్రసాద్‌ హత్య కేసులో కీలక నిందితుడైన శ్యామ్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇవాళ కోరాడ విజయ్‌ కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో మిగతా నిందితుల కోసం పోలీసులు అయిదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ నగరాల్లో గాలిస్తున్నారు. ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై ఆరా తీస్తున్నారు.

Recommended Video

    Rajahmandry Business Man Send Ashadham Saare In A Grand Style To His Daughter | Oneindia Telugu
    తక్కువ మొత్తానికే కంపెనీ.. నో అనడంతో

    తక్కువ మొత్తానికే కంపెనీ.. నో అనడంతో

    కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్‌కు చెందిన జిక్సిన్ కంపెనీని తక్కువ ధరకే కొట్టేయాలని నిందితులు స్కెచ్ వేసినట్లు డ్రైవర్ బాబు పోలీసులకు తెలిపాడు. ఇదే అంశంలో గత ఏడాది కాలంగా కోరాడ విజయ్.. రాహుల్ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. రూ. 15 కోట్లు విలువ చేసే జిక్సిన్ కంపెనీ30 శాతం వాటాను వెనక్కి ఇవ్వాలన్ని కోరాడు విజయ్. ఇందుకోసం రాహుల్‌పై ఒత్తిడి తీసుకువచ్చాడు. డబ్బుల కోసం రాహుల్‌ను ఇబ్బందులకు గురి చేశాడు. మరోవైపు విజయ్ వాటాను కొనేందుకు కోగంటి సత్యం ప్రయత్నించాడు. అతనికి కంపెనీలో షేర్ ఇచ్చేందుకు రాహుల్ నిరాకరించాడు. దాంతో రాహుల్‌ను హత్య చేయాలని వారు నిర్ణయించుకున్నారు. మూడు నెలల క్రితమే రాహుల్ హత్యకు భారీ స్కెచ్ వేశారు. రాహుల్ హత్యకు మాస్టర్ ప్లాన్ వేసింది కోగంటి టీమ్‌గా పోలీసులు భావిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+