విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయనేమీ తక్కువోడు కాదు... దగ్గుపాటి వెంకటేశ్వరరావుపై లక్ష్మీ పార్వతి సంచలనం

|
Google Oneindia TeluguNews

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, తెలుగు అకాడమీ డైరెక్టర్ లక్ష్మీపార్వతి ఎన్టీరామారావు పెద్దల్లుడు, వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై సంచలన ఆరోపణలు చేశారు. గతంలో కూడా చంద్రబాబు వెన్నుపోటు వెనుక పురంధరేశ్వరి ఉందని పలుమార్లు ఆరోపణలు చేసిన లక్ష్మీ పార్వతి, ఇప్పుడు పురంధరేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై ఆరోపణలు గుప్పించారు. మొదట నుండీ దగ్గుపాటి ఫ్యామిలీ అంటే గిట్టని లక్ష్మీ పార్వతి నాడు ఎన్టీఆర్ కు దగ్గుపాటి వెంకటేశ్వర్ రావు, పురంధరేశ్వరిలు తీరని అన్యాయం చేశారని చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే.

వైసీపీలో చేరికపై స్పందించిన దగ్గుపాటి పురంధరేశ్వరి ... ఒత్తిడి నిజమే కానీ ...వైసీపీలో చేరికపై స్పందించిన దగ్గుపాటి పురంధరేశ్వరి ... ఒత్తిడి నిజమే కానీ ...

ఇక తాజాగానూ తనపై అసత్య ప్రచారాలు చేయడంలో దగ్గుపాటి పాత్ర కూడా ఉందన్న లక్ష్మీపార్వతి ఆయనేమీ తక్కువోడు కాదని, చాలా చేశాడని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఉన్న సమయంలో తనకు పదవి ఇస్తానన్నా రాకుండా అడ్డుకున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు.తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నమ్మే పరిస్థితి లేదని, ఆ పార్టీ నేతల్లో చాలామంది టెన్షన్ పడుతున్నారు అని చెప్పిన లక్ష్మిపార్వతి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఓయ్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Lakshmi Parvathi sensational comments on Daggubati ... he is not a right person

గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పర్చూరు నియోజకవర్గం నుండి పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వర రావు పై ఆమె చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు అనుకూల మీడియాలో తనపై వ్యతిరేక వార్తలు రాయించారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. నాడు తనపై జరిగిన తప్పుడు ప్రచారంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్ర ఉందని, తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు చేశారు.

English summary
YCP state secretary and NTR's wife Lakshmiparvati made interesting comments in the wake of news of the capital Amaravati change. She commented that jagan never talk about change of capital. Meanwhile, Lakshmi Parvati, who made some interesting comments there is a need for decentralization of capital for any state to develop.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X