విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపిలోకే వంగ‌వీటి రాధా : ముహూర్తం ఖ‌రారు : 26వ తేదీ సాయంత్రం బాబు స‌మ‌క్షంలో..!

|
Google Oneindia TeluguNews

వంగ‌వీటి రంగా త‌న‌యుడు రాధా టిడిపి ఎంట్రీ ముమూర్తం ఖ‌రారైంది. తాజాగా రాధా మీడియా స‌మావేశంలో త‌న భ‌విష్య త్ రాజ‌కీయం గురించి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ఏ పార్టీలో చేరేదీ క్లారిటీ ఇవ్వ‌లేదు. దీంతో..ఆయ‌న కొంద‌రి అభిమానుల కోరిక మేర‌కు జ‌న‌సేన వైపు చూస్తున్నార‌ని..స్వ‌తంత్ర‌గా పోటీ చేస్తార‌ని మ‌రి కొంద‌రు అంచనా వేసారు. అయితే, వీట‌న్నింటినీ కాద‌ని..రాధా టిడిపిలో చేర‌టానికే నిర్ణ‌యించుకున్నారు. రిప‌బ్లిక్ డే నాడు ఆయ‌న టిడిపిలో చేరుతున్నారు.

రాధా వ్యాఖ్య‌ల‌తో రంగా అభిమానుల కంట క‌న్నీళ్లు :ఆయ‌న కోస‌మే నెహ్రూను వైసిపి లోకి తీసుకోలేదు..! రాధా వ్యాఖ్య‌ల‌తో రంగా అభిమానుల కంట క‌న్నీళ్లు :ఆయ‌న కోస‌మే నెహ్రూను వైసిపి లోకి తీసుకోలేదు..!

టిడిపిలోకి ఎంట్రీ.. ముహూర్తం ఖ‌రారు..

టిడిపిలోకి ఎంట్రీ.. ముహూర్తం ఖ‌రారు..

వంగ‌వీటి రాధా మీడియా స‌మావేశం ద్వారా అనేక ప్ర‌శ్న‌లు తెర మీద‌కు వ‌చ్చాయి. వైసిపి కి రాజీనామా చేయ‌టం..జ‌గ‌న్ పై ఆరోప‌ణ‌లు చేయ‌టం..త‌న తండ్రి హ‌త్య గురించి మాట్లాడ‌టం త‌రువాత రాధా రాజ‌కీయంగా టిడిపిలో చేరుతారా లేదా అనే చ‌ర్చ మొద‌లైంది. త‌న తండ్రి హ‌త్య కేసులో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల పై వైసిపి నేత‌లు స్పందించారు. అదే విధం గా జ‌గ‌న్ పై చేసిన ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొట్టారు. రాధా అమ‌యాకుడ‌ని చంద్ర‌బాబు చేతిలో చిక్కుకున్నార‌ని ఆరోపించారు. ఇదే స‌మ‌యంలో రాధా మిత్ర‌మండ‌లి కి చెందిన కొంద‌రు రాధాను జ‌న‌సేన లోకి వెళ్లాల‌ని సూచించారు. త‌న తండ్రి ఆశ యాల కోసం తాను ప‌ని చేస్తాన‌ని రాధా స్ప‌ష్టం చేసారు. అయితే, ఏ పార్టీలో చేరుతున్నారు..

టిడిపి లోకి వెళ్తున్నారా ప్ర‌శ్న‌

టిడిపి లోకి వెళ్తున్నారా ప్ర‌శ్న‌

టిడిపి లోకి వెళ్తున్నారా అనే ప్ర‌శ్న‌కు మాత్రం ఆయ‌న స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. దీంతో..ఆయ‌న రాజ‌కీయంగా టిడిపిలో చేరాల‌నే నిర్ణ‌యాన్ని వాయిదా వేసు కున్నారా..లేక జ‌న‌సేన‌తో వెళ్తారా అనే చ‌ర్చ మొద‌లైంది. దీని పై విజ‌య‌వాడ లో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. టిడిపి లోకి వెళ్లేవారైతే..ఆ విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పేవార‌ని అనేక మంది విశ్లేషించారు. అయితే, వంగ‌వీటి రాధా టిడిపి లోనే చేరాల‌ని నిర్ణ‌యించారు. 26వ తేదీ రిప‌బ్లిక్ డే నాడు సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌మ‌క్షం లో రాధా టిడిపి లో చేర‌టానికి ముమూర్తం ఖ‌రారైంది.

ఎమ్మెల్యే టిక్కెట్ లేదు..టార్గెట్ జ‌గ‌న్‌..

ఎమ్మెల్యే టిక్కెట్ లేదు..టార్గెట్ జ‌గ‌న్‌..

వంగ‌వీటి రంగా అభిమానులు సైతం టిడిపి వైపు ఉండేలా ఆ పార్టీ వ్యూహం అమ‌లు చేస్తోంది. వంగ‌వీటి రాధా ను టిడిపి లోకి తీసుకోవ‌టం ద్వారా ఒక సామాజిక వ‌ర్గంలో ప్ర‌భావం ఉంటుంద‌ని టిడిపి నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. ఇందులో భాగంగా..రాధా ను టిడిపి లోకి తీసుకున్నా..వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ పై ఏ విధ‌మైన హామీ ఇవ్వ‌లేదు. పార్టీ కోసం వివిధ వేదిక‌ల ద్వారా రాధా సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో వైసిపి లో దాదా పు నాలుగున్నారేళ్లు ప‌ని చేసిన రాధా ఇప్పుడు జ‌గ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకొని చేస్తున్న ఆరోప‌ణ‌లు సైతం త‌మ‌కు క‌లిసి వ‌స్తాయ‌ని టిడిపి నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. రాధా కు టిడిపి నుండి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తార‌ని చెబుతున్నారు. రాధా చేరిక ద్వారా విజ‌య‌వాడ లోని మూడు స్థానాల్లో టిడిపికి మ‌రింత బ‌లం చేకూరుతుంద‌ని టిడిపి లెక్క‌లు క‌డుతోంది. ఇదే స‌మ‌యంలో విజ‌య‌వాడ తో పాటుగా స‌మీప జిల్లాల్లోని రంగా అభిమానుల‌ను సైతం ఆక‌ర్షించేందుకు రాధా టిడిపి ఎంట్రీ ఉప‌యోగిస్తుంద‌ని టిడిపి నేత‌లు చెబుతున్నారు. దీంతో..టిడిపి లో చేరిన త‌రువాత రాధా రాజ‌కీయంగా ఏ ర‌కంగా ముందుకు వెళ్తారు..టిడిపి లో చేర‌టం పై ఆయ‌న అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

English summary
Vangaveeti Radha decided to join in TDP. He join in TDP on jan 26th in presence of Chandra Babu. After media conference in Vijayawada by Radha many speculations come out that Radha may join in Janasena or contest as independent. But, Radha finally joining in TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X