ఫ్రంట్‌లైన్ వారియర్స్ కుటుంబాలను ఆదుకొండి: కుటుంబానికి రూ.కోటి, ఉద్యోగం ఇవ్వండి: పవన్

కరోనా సోకి చనిపోయిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయా కుటుంబాలకు రూ. కోటి పరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు.

రాష్ట్రంలో వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ స్టాఫ్ 200 మంది వరకు.. 600 మంది పోలీసులు కరోనా బారినపడ్డారని గుర్తుచేశారు. 10 మంది పోలీసు సిబ్బంది చనిపోయారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వారి త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఉద్యోగులకు కరోనా వైరస్ సోకితే వేతనంతో కూడిన సెలవు మంజూరు ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరారు.

pawan kalyan asked govt to frontline warriors family need help

ప్రైవేట్ కంపెనీలు కూడా తమ సిబ్బంది కరోనా వచ్చి సెలవులో ఉంటే వేతనం ఇవ్వాలన్నారు. ప్రైవేట్ సంస్థలు ఈ విషయంలో సానుభూతితో ఆలోచించాలన్నారు. వాస్తవానికి యాజమాన్యాలకు ఇబ్బందులు ఉన్నా.. కంపెనీ కోసం పని చేసినవారికి వైరస్ సోకిందున మానవతా ధృక్పథంతో స్పందించాలని కోరారు. ఉద్యోగులకు వేతనం కోల్పోతామనే ఆందోళన లేకుంటే... వారు వేగంగా కోలుకుంటారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Recommended Video

    Rajnath In Leh : 'Talks Are On But Can’t Guarantee Outcome' || Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+