‘శవమై తేలుతావు’ అగ్గిరాజేసిన బుద్దా కామెంట్స్, ఇంటికి పోలీసులు, టీడీపీ శ్రేణులు

ఏపీలో క్యాసినో వివాదం దుమారం కొనసాగుతోంది. ఇవాళ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లేందుకు ట్రై చేస్తే శవమై తేలుతామని మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి కామెంట్ చేశారు. దీనిపై ఫిర్యాదులు వచ్చాయి. ఆ వ్యాఖ్యలపై వివరణ తీసుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు విజయవాడలోని ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు.

కొడాలి నానిపై కామెంట్స్

కొడాలి నానిపై కామెంట్స్

మంత్రి కొడాలి నానిపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ నేతల ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. చంద్రబాబు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే ప్రాణం తీస్తామని వెంకన్న ఇవాళ ఉదయం హెచ్చరించారు. చంద్రబాబు ఇంటిని టచ్ చేస్తే శవమై వెళ్తావని వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే రా తేల్చుకుందామని అన్నారు. ఇంత జరుగుతున్నా డీజీపీ స్పందించరా అని ఆయన మండిపడ్డారు. పోలీసులు చేరుకున్నారనే సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో బుద్దా వెంకన్న ఇంటికి చేరుకునే ప్రయత్నం చేశారు.

పాలించడం రాదు

పాలించడం రాదు

అంతకుముందు బుద్దా వెంకన్న కామెంట్స్ చేశారు. వైసీపీ నేత‌ల‌కు ప‌రిపాల‌న చేత కావ‌డం లేద‌ని, అందుకే త‌మ పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడిపై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మంత్రి కొడాలి నాని ఇటీవ‌ల చంద్ర‌బాబు నాయుడిపై చేసిన వ్యాఖ్య‌లు స‌రికాద‌ని చెప్పారు. చేతగాని దద్దమ్మలు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారని, కొడాలి నాని భాష ఏంటి? అత‌డి చరిత్ర ఏంటి అంటూ తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుప‌డ్డారు.

Recommended Video

    శ్రీకాంతా చారి విగ్రహం దగ్గర చెల్లా చెదురైన కాంగ్రెస్ శ్రేణులు!!
    ఆయిల్ దొంగ

    ఆయిల్ దొంగ

    గుడివాడలో కొడాలి నాని ఆయిల్ దొంగ అని, గ‌తంలో పోలీసు స‌ర్వీసులో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌ను వర్ల రామయ్య లోపల వేసి చితక బాదార‌ని, ఆయ‌న‌పై చ‌ర్యలు తీసుకున్నార‌ని చెప్పారు. పోలీసులు లేకుండా విజయవాడలో స‌మ‌యం ఫిక్స్ చేసి చెప్పాల‌ని, దమ్ముంటే కొట్టుకునేందుకు రావాల‌ని వెంకన్న స‌వాలు విసిరారు. గుడివాడలో కొడాలి నాని చట్ట‌విరుద్ధ కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేస్తూ కృష్ణా జిల్లా పరువు తీస్తున్నార‌ని విమర్శించారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనేనని బుద్ధా వెంక‌న్న కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+