విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ఇసుక దీక్షకు అనుమతి నిరాకరణ.. ఇతర స్థలాలపై టీడీపీ అన్వేషణ

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల పద్నాలుగున విజయవాడలో తలపెట్టిన ఒకరోజు దీక్షకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. పద్నాల్గవ తేదిన దీక్షకు ఏర్పాట్లు చేసుకునేందుకు నగరంలోని మున్సిపల్ స్టేడియంను పరీశీలించిన నేతలు , అనుమతి కోసం పోలీసులతో పాటు మున్సిపల్ అధికారులను కోరారు. అయితే మున్సిపల్ స్థలాన్ని ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. స్టేడియం కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.అయితే దీక్షకు అనుమతి ఇవ్వకున్న చంద్రబాబునాయుడు తలపెట్టిన ఒకరోజు దీక్ష కొనసాగుతుందని టీడీపీ నేతలు తెలిపారు. మున్సిపల్ స్టేడియంకు బదులుగా ధర్నాచౌక్‌ను పరిశీస్తుున్నామని చెప్పారు.

కొద్ది రోజులుగా ఏపీలో కొనసాగుతున్న ఇసుక కొరతపై టీడీపీ అందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రబాబు తనయుడు లోకేష్ గుంటూరులో ఒకరోజు దీక్ష చేశారు. మరోవైపు ఆ పార్టీ నేతలు ఆయా జిల్లాల్లో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు.

police have refused permission for tdp DEEEKSHA

దీంతో చంద్రబాబునాయుడు సైతం రంగంలోకి దిగారు. విజయవాడలో ఒకరోజు దీక్ష చేపడతామని ప్రకటించారు. ఇసుక కొరత తీవ్రంగా ఉండడంతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పతున్నారని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇక ఇసుక కొరతపై వైజాగ్‌లో లాంగ్ మార్చ్ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి రెండువారాల గడువు ఇచ్చిన విషయం తెలిసిందే...

English summary
police have refused permission of TDP chief Chandrababu Naidu one day protest on sand shortage in vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X