Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rahul murder case:సత్యం స్కెచ్.. ట్రైనింగ్ కూడా ఇచ్చారు.. ఇలా రాహుల్ హత్య

విజయవాడ యువ పారిశ్రామిక వేత్త కరణం రాహుల్ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆర్ధిక లావాదేవీల్లో జరిగిన వివాదమే హత్యకు కారణంగా పోలీసులు తేల్చారు. రాహుల్‌ను పక్కా స్కెచ్ వేసి హతమార్చినట్టు పోలీసులు నిర్ధారించారు. కేసులో కీలకంగా మారిన రౌడీ షీటర్ కోగంటి సత్యంను అదుపులోకి తీసుకోవడంతో ఇందులోని అన్ని చిక్కుముడులు వీడిపోయాయి. హత్యలో కోరాడ విజయ్ కుమార్, ఆయన భార్య పద్మజ, కోగింటి సత్యం, గాయత్రి, సీతయ్య, బాబూరావు అనే వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తేలింది.

మెడికల్ సీటు ఇప్పిస్తానని మోసం..

మెడికల్ సీటు ఇప్పిస్తానని మోసం..

మెడికల్ సీటు ఇప్పిస్తానని గాయత్రి వద్ద రాహుల్ రూ.6 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. మెడికల్ సీటు ఇప్పించకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని గాయత్రి.. రాహుల్‌పై ఒత్తిడి తెచ్చింది రాహుల్ తండ్రి రాఘవరావు తొలుత రూ.50 లక్షలు ఇస్తామని గాయత్రికి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల 18వ తేదీన రాత్రి 7.30 నిమిషాలకు గాయత్రి.. రాహుల్‌కు ఫోన్ చేయగా.. ఒక్కడే కారులో బయటకు వెళ్లాడు. ఆమె మాట్లాడిన తర్వాత రాహుల్ కారులో కోరాడ విజయ్, సీతయ్య, బాబూరావు ఎక్కారు. డబ్బులు తెచ్చావా..? అని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. కారులో ఉన్న సీతయ్య అనే వ్యక్తి రాహుల్ మెడకు వైరు బిగించగా.. బాబూరావు దిండుతో మొహాన్ని అదిపట్టుకున్నాడు. దీంతో అక్కడికక్కడే రాహుల్ మృతి చెందాడు. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఇంటికి రానీ రాహుల్..

ఇంటికి రానీ రాహుల్..

ఆ రోజు రాత్రంతా రాహుల్ ఇంటికి రాకపోవడంతో తర్వాతి రోజు ఉదయం అతడి తండ్రి రాఘవరావు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుణదల వద్ద కారులో గుర్తుతెలియని శవం ఉన్నట్లు సమాచారం అందింది. అది రాహుల్ మృతదేహంగా గుర్తించి పోస్ట్‌మార్టంకు తరలించారు. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కోరాడ విజయ్ కుమార్, కోగంటి సత్యం పాత్ర ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. రాహుల్ హత్యకు విజయవాడకు చెందిన రౌడీ షీటర్ కోగంటి సత్యం స్కెచ్ వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

నిందితులకు ట్రైనింగ్..

నిందితులకు ట్రైనింగ్..

రాహుల్‌ను ఎలా హతమార్చాలి.? ఎవరిని రంగంలోకి దించాలి..? హత్య తర్వాత ఎలా వ్యవహరించాలి..? పోలీసులకు అనుమానం రాకుండా ఎలా ఉండాలనేదానిపై కోగంటి సత్యం నిందితులకు ట్రైనింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. హత్య తర్వాత పేరు బయటకు వస్తే ఎలా లొంగిపోవాలనేది కూడా కోరాడ విజయ్ కుమార్ కు కోగంటి సత్యమే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కోగంటి సత్యం 2019లో హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే..!

బెంగళూరులో అరెస్ట్

బెంగళూరులో అరెస్ట్

రాహుల్ హత్య తర్వాత కోగంటి పేరు బయటకు రావడంతో అతన్ని మీడియా సంప్రదించింది. అయితే హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఎవరో అనవసరంగా తనపేరు బయటకు తెచ్చారని సత్యం బుకాయించారు. కానీ అతడే హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. కోగంటి సత్యంను బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి విజయవాడ తరలించారు.

కీలకంగా వాంగ్మూలం

కీలకంగా వాంగ్మూలం

ఈ నెల 18న విజయవాడలో రాహుల్‌ దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. రాహుల్‌ హత్యలో మొత్తం ఐదుగురి పాత్ర ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో పాత్రధారులుగా అనుమానిస్తున్న మరో ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ1గా కోరాడ విజయ్‌కుమార్‌ను చేర్చిన పోలీసులు.. ఏ2గా ఆయన భార్య కోరాడ పద్మజను చేర్చారు. ఏ3గా గాయత్రి, ఏ4గా కోగంటి సత్యం పేర్లను చేర్చారు పోలీసులు. హత్య సమయంలో వీళ్లంతా ఎక్కడున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఈ ముగ్గురిలో ఓ మహిళ మృతుడు రాహుల్‌కు గతంలో 6 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి అంత డబ్బు ఎందుకు ఇచ్చారు? ఏ పని కోసం ఇచ్చారనే దానిపై పోలీసులు వివరాలు రాబడుతున్నారు. రాహుల్ మర్డర్‌ కేసులో ప్రధాన నిందితుడైన కోరాడ విజయ్‌కుమార్ వాంగ్మూలం కీలకంగా మారింది.

ఫిర్యాదుతో ఇలా..

ఫిర్యాదుతో ఇలా..

రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదు మేరకు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా కోరాడ విజయ్‌కుమార్, ఏ2గా కోగంటి సత్యం పేర్లు చేర్చారు. ముగ్గురు మహిళల ప్రేమేయం కూడా రాహుల్ హత్యలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ హత్యతో పాత్రధారులుగా భావిస్తున్న పద్మజ అనే పేరుతో ఉన్న ఇద్దరు మహిళల పేర్లను కూడా ఏ3, ఏ4గా చేర్చారు. కోగంటి సత్యం ద్వారా ఫ్యాక్టరీ కొనుగోలుకు చర్చలు జరిగాయని... తన వాటా డబ్బుల కోసం కోరాడ విజయ్‌కుమార్ అనేకసార్లు ఒత్తిడి తెచ్చారని రాహుల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోరాడ కుటుంబ సభ్యులకు హత్యతో సంబంధముందని రాహుల్ తండ్రి రాఘవరావు ఆరోపిస్తున్నారు. అయితే ఇవాళ కోరాడ విజయ్‌కుమార్‌ పోలీసులకు లొంగిపోయాడు.

విభేదాలు ఇలా

విభేదాలు ఇలా

కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్‌కు చెందిన జిక్సిన్ కంపెనీని తక్కువ ధరకే కొట్టేయాలని నిందితులు స్కెచ్ వేసినట్లు డ్రైవర్ బాబు పోలీసులకు తెలిపాడు. ఇదే అంశంలో గత ఏడాది కాలంగా కోరాడ విజయ్.. రాహుల్ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. రూ. 15 కోట్లు విలువ చేసే జిక్సిన్ కంపెనీ30 శాతం వాటాను వెనక్కి ఇవ్వాలన్ని కోరాడు విజయ్. ఇందుకోసం రాహుల్‌పై ఒత్తిడి తీసుకువచ్చాడు. డబ్బుల కోసం రాహుల్‌ను ఇబ్బందులకు గురి చేశాడు. మరోవైపు విజయ్ వాటాను కొనేందుకు కోగంటి సత్యం ప్రయత్నించాడు. అతనికి కంపెనీలో షేర్ ఇచ్చేందుకు రాహుల్ నిరాకరించాడు. దాంతో రాహుల్‌ను హత్య చేయాలని వారు నిర్ణయించుకున్నారు. మూడు నెలల క్రితమే రాహుల్ హత్యకు భారీ స్కెచ్ వేశారు. రాహుల్ హత్యకు మాస్టర్ ప్లాన్ వేసింది కోగంటి టీమ్‌గా పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+