విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతిలో భూములు కొన్నవాళ్లే అల్లర్లకు కారణమట..రాజధానిపై స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనప్రాయంగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు ఉంటె బాగుంటుంది అని చేసిన ప్రకటన ఆ తరువాత రాజకీయ పరిణామాలు ఏపీలో ఇంకా రాజకీయ వేడిని పుట్టిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రాజధాని రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. జగన్ రాజధానిపై తుది ప్రకటన చేస్తానని చెప్పి దాన్ని వాయిదా వేసినా కూడా రాజధాని రైతుల ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు . మొన్నటికి మొన్న అమరావతిని రాజస్థాన్ ఎడారి అంటూ,వందేళ్ళు అయిన అమరావతి అభివృద్ధి జరిగిందంటూ వివాదాస్పాడ్ అవ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం మరోమారు రాజధాని అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు .

అమరావతి రైతులకు మంచి ప్యాకేజీ: జగన్ అన్యాయం చేయరంటూ మంత్రి పెద్దిరెడ్డిఅమరావతి రైతులకు మంచి ప్యాకేజీ: జగన్ అన్యాయం చేయరంటూ మంత్రి పెద్దిరెడ్డి

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజధాని అమరావతిపై మాట్లాడుతూ ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్న వారు రాజధానిలో అక్రమంగా భూములు కొన్నవారే అని ఆరోపించారు. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఏర్పాటవుతుందనే అంశంలో ఎవరికీ సందేహం అక్కర్లేదన్నారు. అమరావతి ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చెందుతుందని, అమరావతిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తారని స్పీకర్ తమ్మినేని సీతారాం వివరించారు.

Speaker Tammineni Seetharam controversial comments on capital issue

అమరావతిలో బినామీ పేర్లతో భూములు కొన్నవారే రైతులను రెచ్చగొట్టి అల్లర్లకు కారణమవుతున్నారని తమ్మినేని ఆరోపించారు. విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, చంద్రబాబు అందుకే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. విశాఖను రాజధానిగా చేస్తే మీకేంటి నష్టం? అంటూ ప్రశ్నించారు. ఆయన విశాఖనే రాజధాని అని మరోమారు ఘంటా పదంగా చెప్పారు. ప్రస్తుతం వైసీపీ మంత్రుల,నాయకుల వ్యాఖ్యలు జగన్ రాజధాని వ్యవహారంలో ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీలో వైసీపీ నేతలే ఉండటం కూడా రాజధాని మార్పు ఖాయమే అన్న భావన కలిగిస్తుంది. సాక్షాత్తు స్పీకర్ ఈ తరహా వ్యాఖ్యలు చెయ్యటం రాజధాని రైతుల ఆగ్రహానికి కారణం అవుతుంది.

English summary
Tammeneni alleged that those who bought land with benami names in Amravati provoked farmers and caused riots. executive capital will be Vishakha, What is your loss if we make Visakha the capital? tammineni asked
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X