‘టీడీపీవాళ్లే టార్గెట్’: రోడ్డుపై బైఠాయించిన కొల్లు రవీంద్ర అరెస్ట్
కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. మచిలీపట్నం చింతచెట్టు సెంటర్‌లో మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. అయితే, టీడీపీ సానుభూతిపరుల దుకాణాలు తొలగిస్తున్నారంటూ బాధితులకు అండగా నిలిచేందుకు కొల్లు రవీంద్ర వెళ్లారు.
ఘటనా స్థలంలోనే టీడీపీ కార్యకర్తలతోపాటు బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. స్థానికంగా కట్టడాలను కూల్చుతున్నారని.. అధికారులను అడిగితే కమిషనర్ ఆర్డర్ ఉంది కూల్చేస్తున్నామని చెబుతున్నారని తెలిపారు.

15ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న మైనార్టీ సోదరుల కట్టడాలను కూల్చివేస్తున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఎందుకంటే.. ఎన్‌క్లోజ్‌మెంట్ ఉందంటున్నారని చెప్పారు. మిగితావి విడిచి పెట్టి మధ్యలో ఉన్న నిర్మాణాలను కూల్చడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని దాడు చేస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.
ఇది ఇలావుండగా, అక్కసుతోనే టీడీపీ నేతల అరెస్టు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. లేటరైట్ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతల అరెస్ట్ అక్రమమని అన్నారు. సొంత ఆస్తి లాగా రూ. 15వేల కోట్ల బాక్సైట్‌ను సీఎం జగన్ వైసీపీ నేతలకు రాసిచ్చారని ఆరోపించారు.
తన బంధువుల్ని రాబందుల్లా మన్యంపైకి వదిలి వేడుక చూస్తున్నారని లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. రిజర్వ్ ఫారెస్టులో నిబంధనలు ఉల్లంఘించి లాటరైట్ ముసుగులో చేపట్టిన బాక్సైట్ తవ్వకాన్ని టీడీపీ బయటపెట్టిందన్నారు. విక్రాంత్ రెడ్డి, అనిల్ రెడ్డి మైనింగ్ మాఫియాను టీడీపీ బహిర్గతం చేసిందన్న అక్కసుతోనే సీనియర్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయించారని ధ్వజమెత్తారు. తక్షణమే బాక్సైట్ మైనింగ్ నిలిపివేసి పర్యావరణాన్ని, గిరిజనుల హక్కులను కాపాడాలని లోకేష్ డిమాండ్ చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications