గన్నవరం విమానాశ్రయం చుట్టూ చక్కర్లు కొట్టి.. హైదరాబాద్‌లో ల్యాండైన విమానాలు, ఎందుకంటే?
అమరావతి: దేశంలో చలి తీవ్రత కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనూ సాయంత్రం నుంచి ఉదయం వరకు చలి వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో పొగమంచు ఉదయం వరకు ఉంటోంది. దీంతో ప్రజలు సాయంత్రానికి ముందే ఇళ్లకు చేరిపోతున్నారు. ఉదయం కూడా బయటికి వచ్చేందుకు వణికిపోతున్నారు. కాగా, పొగమంచు కారణంగా గన్నవరం విమానాశ్రయంలో రెండు విమానాలు గాలిలోనే చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పొగమంచులో గన్నవరం విమానాశ్రయం..
భారీగా పొగమంచు దుప్పటి కప్పడంతో గన్నవరం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే విమానాలు ఆలస్యం అవుతున్నాయి. సోమవారం ఉదయం పొగమంచు ఆవరించడంతో ఢిల్లీ, బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన విమానాలు ఎయిర్‌పోర్టు చుట్టూ గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఎయిర్ పోర్ట్ రన్‌వేపై పొగమంచు ఎక్కువగా ఉండటంతో విమానం ల్యాండ్ అయ్యేందుకు సాధ్యం కాలేదు.

గన్నవరం విమానాశ్రయంపై చక్కర్లు కొట్టి హైదరాబాద్‌కు విమానాలు
దట్టమైన పొగమంచు కప్పేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న ఇండిగో విమానం సుమారు గంటన్నర సేపు గాలిలో చక్కర్లు కొట్టి చివరకు హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కూడా తిరిగి హైదరాబాద్‌లో సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది.
Recommended Video

పొగమంచుతో ల్యాండ్ కాలేని పరిస్థితి..
హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన ఇండిగో విమానం గన్నవరం ఎయిర్పోర్ట్ చుట్టూ చక్కర్లు కొట్టడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగిందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లుగా తెలిపారు. పొగ మంచు పరిస్థితులు చక్కబడ్డాక విమానాల ల్యాండింగ్‌కు తిరిగి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. సోమవారం మాత్రమే కాదు.. గత రెండు వారాలుగా మంచుదుప్పటితో ఎయిర్‌పోర్టులో విమానలు దిగేందుకు ఇబ్బందిగా మారింది. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మంచు ప్రభావం తగ్గిన తర్వాతే అధికారులు విమానాలు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు అనుమతిస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications