మళ్లీ కలిసిన కొడాలి నాని, వంగవీటి రాధా- ఏడాది గ్యాప్ తర్వాత-ఎన్నికల వేళ మళ్లీ చర్చ !

ఏపీలో గుడివాడ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిరేపుతూనే ఉంటాయి. అందుకు ఓ కారణం అక్కడ వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన కొడాలి నాని. దీంతో ఆయన తీసుకునే ప్రతీ నిర్ణయం, చేసే ప్రతీ పనిని సొంత పార్టీతో పాటు విపక్షాలు కూడా నిశితంగా గమనిస్తుంటాయి. ఇదే క్రమంలో ఆయన తరచుగా ఆయన పాతమిత్రుడు, ప్రత్యర్ధి పార్టీ టీడీపీ నేత కూడా అయిన వంగవీటి రాధాతో కనిపిస్తున్నారు. వీరిద్దరి కలయికకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని అనుచరులు చెప్తున్నా మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో ఈ భేటీలకు ప్రాధాన్యం లభిస్తోంది.

కొడాలి-వంగవీటి స్నేహం

కొడాలి-వంగవీటి స్నేహం

కొడాలి నాని గుడివాడ ఎమ్మెల్యే కాకముందు నుంచే దివంగత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాతో స్నేహం ఉంది. కొడాలి ఎమ్మెల్యే కాకముందే రాధా ఎమ్మెల్యే అయ్యారు. రాధాకు మంత్రి పదవి కలగానే మిగిలిపోతుండగా.. నాని మాత్రం తొలిసారి జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. ఆ తర్వాత మంత్రి పదవి పోయినా ఎమ్మెల్యేగా ఉంటూనే మరోసారి గుడివాడలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తరచుగా వంగవీటి రాధాతో కలిసి దర్శనమిస్తున్నారు. దీంతో కొడాలి-వంగవీటి భేటీలపై రాజకీయ చర్చ జరుగుతోంది.

మరో ఫంక్షన్లో కలిసిన నాని, రాధా

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని, వంగవీటి రాధా పలుమార్లు ఫంక్షన్లలో దర్శనమిచ్చారు. ఇదే క్రమంలో గతేడాది కూడా ఓ ఫంక్షన్లో వీరిద్దరూ కలిశారు. అంతే కాదు ఫంక్షన్ కు హాజరై తిరిగి వెళ్లిపోలేదు. అక్కడే కాసేపు ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకున్నారు కూడా. దీంతో రాజకీయంగా కొత్త చర్చలు మొదలయ్యాయి. ఇప్పుడు మరోసారి గుడివాడలోనే జరిగిన గుడ్లవల్లేరు వైసీపీ నేత కుమార్తె పెళ్లి వేడుకలో వీరిద్దరూ మళ్లీ కలిశారు. దీంతో వీరిద్దరి భేటీకి మరోసారి ప్రాధాన్యం ఏర్పడింది.

రాధా కోసం కొడాలి వెయిటింగ్

గుడ్లవల్లేరుకు చెందిన వైసీపీ నేత కుమార్తె వివాహం కోసం నిన్న రాత్రి ఫంక్షన్ హాల్ కు కొడాలి నాని ముందుగా చేరుకున్నారు. అయితే రాధా అప్పటికి ఇంకా అక్కడికి రాలేదు. దీంతో ఆయన కోసం కొడాలి నిరీక్షించారు. అంతే కాదు రాధా వస్తున్నారని తెలుసుకుని ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. రాధా కారు డోర్ తీసి దిగగానే అక్కడే ఉన్న కొడాలి నాని ఆయన్ను లోపలికి ఆహ్వానించారు. తర్వాత రాధాను తీసుకుని ఫంక్షన్ హాల్లోకి వెళ్లారు. పెళ్లి జరుగుతున్నంత సేపు అక్కడే ఉన్నారు. దీంతో ఈ ఫంక్షన్ కు వచ్చిన వారంతా వీరిద్దరి గురించే చర్చించుకోవడం కనిపించింది.

కొడాలి-రాధా కలయికతో మళ్లీ చర్చ ?

కొడాలి నానితో నిన్న వంగవీటి రాధా పెళ్లి వేడుక సందర్భంగా భేటీ కావడంతో మళ్లీ వీరిద్దరిపై రాజకీయ చర్చ మొదలైంది. ముఖ్యంగా రాధాను తిరిగి వైసీపీలోకి తెచ్చేందుకు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న కొడాలి నాని మధ్యలో ప్రయత్నించి విఫలమయ్యారు కూడా. దీంతో తిరిగి రాధాకు నచ్చజెప్పి వైసీపీలోకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జగన్ పై విమర్శలు చేసి వైసీపీని వీడిన రాధాకు ఇప్పుడు టీడీపీలో అంత ఇబ్బందికర పరిస్ధితులేవీ లేదు. రాధా అడిగిన సీటు ఇచ్చేందుకు చంద్రబాబు కూడా సై అంటున్నారు. దీంతో ఆయన టీడీపీని వీడే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు కొడాలి-రాధా మళ్లీ కలవడంలో కొత్తేమీ లేదని, రాజకీయాలు చర్చకు రాలేదని వీరిద్దరి అనుచరులు ఈసారి కూడా చెప్పుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+