నువ్వు ఎన్ని చేసినా రావణాసురుడివే.. ఆ విక్టరీ సింబల్ తో పర్యటనలేంటి చంద్రబాబు : సాయిరెడ్డి ఫైర్
రామతీర్థం కోదండరాముని విగ్రహ విధ్వంస ఘటనతో మొదలైన రాజకీయ దుమారం నేటికీ కొనసాగుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రామతీర్థం శ్రీ రాముల వారి విగ్రహ ధ్వంసం ఘటన వెనుక చంద్రబాబు హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి, తాజాగా రామతీర్థంలో విక్టరీ సింబల్ చూపిస్తూ పర్యటనలేంటి చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు.

రామతీర్ధం ఘటన నుండి చంద్రబాబుని టార్గెట్ చేస్తున్న విజయసాయి రెడ్డి
రామతీర్థం ఘటన జరిగిన తరువాత చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు, లోకేష్ ల కనుసన్నలలోనే విగ్రహ ధ్వంసం ఘటన జరిగిందని, ఈ ఘటనలో పట్టుబడిన టిడిపి నేతల ద్వారా ఈ విషయం బయటపడిందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత చంద్రబాబు వెళ్ళిన రోజు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రామతీర్థం లో రాముల వారి ఆలయాన్ని సందర్శించారు. తీవ్ర ఆరోపణలు, తీవ్ర ఉద్రిక్తతల మధ్య రామతీర్థంలో రాజకీయ రచ్చ కొనసాగింది.

శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి విక్టరీ సింబల్ చూపిస్తూ చంద్రబాబు
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు బూటు కాళ్లతో రామతీర్థం పుణ్యక్షేత్రం లో అడుగుపెట్టి తీవ్ర అపచారానికి పాల్పడ్డాడంటూ రాజకీయ లబ్ది కోసం పాకులాడే బాబుకు దేవుడిపై భక్తి సాంప్రదాయాల పట్ల గౌరవం లేదంటూ విమర్శించారు.
బూటు కాళ్ళతో ఎవరైనా ఆలయంలోకి వెళ్తారా అని మండిపాడ్డారు. ఇక తాజాగా శ్రీరాముడి విగ్రహాన్ని మీరు , మీ గ్యాంగ్ ధ్వంసం చేసి ఆ విక్టరీ సింబల్ చూపిస్తూ పర్యటన ఏంటి బాబు ? రామతీర్థం రాముడితో రాజకీయాలు చేస్తావా ? అని నిప్పులు చెరిగారు .

మతాల మధ్య మారణహోమం.. ఎన్ని చేసినా రావణాసురుడివే..
ఎన్ని చేసినా నువ్వు రావణాసురుడి వే .. జనం చీదరించుకోవడంతో ఇప్పుడు మతాల మధ్య మారణహోమం సృష్టించాలని అనుకుంటున్నావా? అంటూ చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. చంద్రబాబునాయుడు రాష్ట్రంలో విగ్రహాల విధ్వంస ఘటనలకు కారణమంటూ తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు విజయసాయిరెడ్డి. ఇటీవల అను'కుల మీడియా యజమానులను కలిసేందుకు వెళ్తే బూట్లు విప్పి వంగి వంగి వినయం ప్రదర్శిస్తాడు కానీ పూజల్లో, ఆలయ ప్రాంగణాల్లో మాత్రం పాదరక్షలు ససేమీరా విప్పేది లేదంటాడు. భక్తి గురించి, మత విశ్వాసాల గురించి ఈయన ప్రవచనాలు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు