జగన్ మరో మాయాజాలం .. వైఎస్ఆర్ జలకళ కొత్త స్కీమ్ కాదు .. .. యనమల ఫైర్
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించినా టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, రైతుల సంక్షేమం కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పలు పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా సరే పథకాల అమలులో మాత్రం ఎక్కడా వెనకడుగు వెయ్యటం లేదు .అందులో భాగంగా ఈరోజు వైయస్సార్ జలకళ పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్.
Recommended Video
వైఎస్ఆర్ జలకళ పథకంపై కూడా టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వైయస్సార్ జలకళ పథకం జగన్ మరో మాయాజాలమని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈ స్కీమ్ ద్వారా సీఎం జగన్ మరో మాయాజాలానికి తెర తీశారని మండిపడ్డారు . వైసిపి ప్రభుత్వం అందిస్తున్న వైయస్సార్ జలకళ పథకం కొత్త పథకం కాదని, ఇది పాత స్కీమ్ అని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు నష్టం చేస్తున్నారని , ఉచిత బోర్లు అని చెప్పటం రైతులు మూతికి చిక్కం కట్టడమే అని యనమల ఫైర్ అయ్యారు. కరెంట్ బిల్లులు నాలుగు రెట్లు పెంచి నాలుగు వేల కోట్ల భారం మోపారని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు 4 వేల కోట్లు ఎగ్గొట్టడం ద్రోహం అని సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు . వైయస్సార్ జలకళ పథకంపై విమర్శల వర్షం కురిపించారు యనమల రామకృష్ణుడు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications