వల్లభనేని వంశీ రాకను వ్యతిరేకిస్తున్న యార్లగడ్డ వెంకట్రావు .. టెన్షన్ లో అనుచరులు
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గం నుండి వంశీ పై పోటీచేసిన యార్లగడ్డ వెంకట్రావుకు టెన్షన్ మొదలైంది. వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం ఖాయమని ఆయనకు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక పదవి ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా తను పట్టు కోల్పోతానని యార్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
దీపావళి తర్వాత ఈ విషయంలో క్లారిటీ ఇస్తానని వంశీ ఇప్పటికే చెప్పారు. వంశీకి కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే గనుక జరిగితే నియోజకవర్గంలో తన ప్రాధాన్యత తగ్గుతుందని యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర ఆందోళనలో ఉన్నారని సమాచారం. ఇక వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీ లో చేరతారన్న వార్త గన్నవరం నియోజకవర్గం వైసీపీలో అలజడి సృష్టిస్తోంది గత ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడి వంశీ చేతిలో ఓటమిపాలైన వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

వంశి వైసిపి లో చేరితే స్థానికంగా ఇబ్బందులు ఎదురవుతాయని వారు యార్లగడ్డ చెబుతున్నారు .ఆయన రాకను నిరసిస్తూ పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వెంకట్రావు ఇంటికి చేరుకుంటున్నారు. వంశీ వైసీపీలో చేరితే యార్లగడ్డ భవితవ్యం ఏమిటనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎలాగైనా వల్లభనేని వంశీ వైసీపీలో చేరకుండా ఉండేందుకు గట్టిగా ప్రయత్నించాలని, సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తమ విముఖతను తీసుకెళ్లాలని యార్లగడ్డ వర్గీయులు భావిస్తున్నారు. మరి దీపావళి తర్వాత వంశి ఏం నిర్ణయం తీసుకుంటారో.. యార్లగడ్డ ఏం చేస్తారో తేలే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications