ఇసుక నుండి తైలం తీసే మీ తెలివి జగన్ కు ఎక్కడిది : చంద్రబాబుపై విజయసాయి వ్యంగ్యాస్త్రాలు

ఏపీ ప్రతిపక్ష నేత ,టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ఆయన చంద్రబాబు నాయుడ్ని టార్గెట్ చేశారు. గతంలో టీడీపీ పాలనలోని వివిధ సందర్భాలను గుర్తు చేసి మరీ విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు కోతల మనిషని , ఆయనకు ఆయనే మేధావి అని ఫీల్ అవుతారని , నోరు తెరిస్తే అబద్దాలు చెప్తారని విజయసాయి తన పోస్ట్ లతోనే రచ్చ చేశారు.

 చంద్రబాబు ఉష్ణోగ్రతలు తగ్గించమని ఆదేశించారని ఎద్దేవా

చంద్రబాబు ఉష్ణోగ్రతలు తగ్గించమని ఆదేశించారని ఎద్దేవా

అప్పుడెప్పుడో స్విట్జర్లాండ్ మంత్రి పాస్కల్ కూషెపిన్ బాబు లాగా కోతలు కోస్తే తమ దేశంలో మెంటల్ హాస్పిటల్‌కు పంపిస్తారని గాలి తీశాడు. అయినా కొంచెం కూడా మారలేదని చంద్రబాబును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు . రాష్ట్రంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించాలని అప్పట్లో అధికారులను ఆదేశించడం పిచ్చి కాకపోతే మరేంటి? చంద్రబాబు అంతటి ఘనుడు అంటూ వ్యంగ్యాస్రాలు సంధించారు విజయసాయి రెడ్డి . ఇక చంద్రబాబుకు సమావేశాలు పెట్టి అదేశాలివ్వటం తప్ప ఇంకేం తెలీదని , ఉష్ణోగ్రతలు తగ్గించమని ఆదేశించారని ఎద్దేవా చేశారు.

పోతిరెడ్డిపాడు కట్టింది తనే అని సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని ఫైర్

పోతిరెడ్డిపాడు కట్టింది తనే అని సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని ఫైర్

ఇక అంతేకాదు మరో ట్వీట్‌లో చంద్రబాబునాయుడు ప్రచారం కోసం దేనికైనా తెగిస్తాడని పేర్కొన్నారు. గతంలో తమిళనాడు సీఎం జయలలిత కుమార్తెనని ఎవరో అమ్మాయి కోర్టుకెక్కడం, హీరో ధనుష్ తమ కుమారుడే అని ఇంకొకాయన హంగామా చేయడం చూశాం. ఇక చంద్రబాబు నాయుడు పోతిరెడ్డిపాడు కట్టింది తనే అని సిగ్గులేకుండా క్లెయిం చేసుకోవడం కూడా అలాంటి సంచలనమే అంటూ తీవ్రంగా దుమ్మెత్తిపోశారు . ఆయన హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదు. అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు.

Recommended Video

    AP CM YS Jagan Released MSMEs Financial Package
     ప్రైవేటు విద్యుత్తు సంస్థలకు దోచిపెట్టడానికి జగన్ కు మీకున్నంత తెలివి లేదు

    ప్రైవేటు విద్యుత్తు సంస్థలకు దోచిపెట్టడానికి జగన్ కు మీకున్నంత తెలివి లేదు

    అంతేకాదు రాష్ట్రంలో కరెంట్ గురించి అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని మండిపడిన ఆయన చంద్రబాబును ఎద్దేవా చేశారు. కరెంటు గురించి జగన్ గారికి అస్సలు అవగాహన లేదట. ఇక లక్ష కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటు విద్యుత్తు సంస్థలకు దోచిపెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారే, ఆ స్థాయి మేధస్సు నిజంగానే జగన్ గారికి లేదు అంటూ గతంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను గుర్తి చేసి మరీ తిట్టిపోశారు . పైగా ఒప్పందాలను రద్దు చేయాలంటున్నాడు. ఇసుక నుంచి తైలం తీసే మీతెలివి జగన్ కు ఎక్కడిది అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్రాలు సంధించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+