విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను100 శాతం ప్రైవేటీకరిస్తాం, ఏపీకి ఈక్విటీ షేర్ లేదంటూ కేంద్రం షాక్

|
Google Oneindia TeluguNews

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమం కొనసాగుతోంది. ఇటీవల ఏపీ రాష్ట్ర బంద్ ను నిర్వహించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష పార్టీల నాయకులు ఆందోళన చేశారు. అయినప్పటికీ కేంద్ర సర్కార్ తాము తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేది లేదని మరోమారు స్పష్టం చేసింది.

 పార్లమెంట్ వేదికగా మరోమారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

పార్లమెంట్ వేదికగా మరోమారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తధ్యం అన్న కేంద్రం

పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేస్తామని, స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్రానికి ఏ విధమైన సంబంధం లేదని ఆమె తేల్చి చెప్పారు. స్టీల్ ప్లాంట్ అమ్మకంపై జగన్ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని పేర్కొన్న నిర్మలాసీతారామన్ అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలిపారు.

 స్టీల్ ప్లాంట్ లో 100% పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లుగా చెప్పిన నిర్మల సీతారామన్

స్టీల్ ప్లాంట్ లో 100% పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లుగా చెప్పిన నిర్మల సీతారామన్


స్టీల్ ప్లాంట్ లో 100% పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లుగా నిర్మల సీతారామన్ స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈక్విటీ షేర్ లేదని పేర్కొన్న నిర్మలాసీతారామన్ ఏపీ ప్రభుత్వానికి ఈ వ్యవహారంతో సంబంధం లేదని ప్రకటించారు. మెరుగైన ఉత్పాదకత కోసం ప్రైవేటీకరణకు ఇస్తున్నట్లుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు.

మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.

25 వ రోజుకు విశాఖ ఉక్కు ఉద్యమం

25 వ రోజుకు విశాఖ ఉక్కు ఉద్యమం

విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవడం కోసం చేపట్టిన ఆందోళన 25 వ రోజుకు చేరుకున్నాయి . ఇక నేటి నుండి పార్లమెంటు సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో ఏపీ ఎంపీలు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకోసం ఉభయసభల్లో గట్టిగా ప్రశ్నించాలని విశాఖ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మోదీ సర్కార్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం సాగించాలి అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోంది.

కేంద్రం మరోమారు తేల్చి చెప్పటంతో కింకర్తవ్యం ఏమిటో ?

కేంద్రం మరోమారు తేల్చి చెప్పటంతో కింకర్తవ్యం ఏమిటో ?

ఉద్యమంలో భాగంగా ధర్నాలు ,రిలే దీక్షలు, మానవహారాలు నిరసనలు మిన్ను ముడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పార్లమెంట్ వేదికగా మంత్రి నిర్మల సీతారామన్ వంద శాతం ప్రైవేటీకరిస్తాం అని తేల్చి చెప్పడంతో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆందోళన సాగిస్తున్న ప్రజా సంఘాలు ,కార్మిక సంఘాలు, బీజేపీ మినహా అఖిలపక్ష పార్టీల నాయకులు ఏం చేస్తారో తేలాల్సి ఉంది. ఇక ఏపీలో అధికార , ప్రతిపక్ష పార్టీలు విశాఖ ఉక్కు కోసం కేంద్రంతో పోరాటం సాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది .

English summary
Union Finance Minister Nirmala Sitaraman has given a written reply to a question raised by MP Satyanarayana in the wake Parliament session. She asserted that the Visakhapatnam steel plant would be privatized under any circumstances and that the state had no involvement in the steel plant affair. Nirmala Sitharaman clarified that 100% investment in steel plant is being withdrawn. Noting that the Andhra Pradesh government has no equity stake in the Visakhapatnam steel plant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X