విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాయిప్రియ కథ కంచికి.. విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో హైడ్రామా.. కోటి ఖర్చుకు సమాధానమిదే!!

|
Google Oneindia TeluguNews

పెళ్లి రోజున భర్తతో కలిసి బీచ్ కి వెళ్లి ప్రియుడితో జంప్ అయిన సాయి ప్రియ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం సముద్రంలో గల్లంతయింది అన్న అనుమానంతో నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది సాయిప్రియ కోసం విస్తృతంగా గాలించారు. ఆ తర్వాత తాను ప్రేమించిన రవితో కలిసి బెంగళూరులో ఉన్నట్టుగా తండ్రి ఫోన్ కు వాయిస్ మెసేజ్ పంపించి సాయి ప్రియ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో సాయి ప్రియను, ఆమె ప్రియుడు రవిని బెంగళూరు నుండి విశాఖకు పోలీసులు తీసుకువచ్చారు.

ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో సాయిప్రియ, రవి... కుటుంబ సభ్యులతో ఘర్షణ

ఎన్ఏడి జంక్షన్ లోని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో వారిద్దరూ తమకు రక్షణ కల్పించాలని, తామిద్దరం మేజర్ల మని పోలీసుల వద్ద చెప్పుకున్నారు . ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో సాయి ప్రియ, రవి దంపతులను వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే సాయి ప్రియ తరఫున బంధువులు మాత్రమే వచ్చారు కానీ రవి తరపున ఎవరూ రాలేదు. అక్కడ కొద్దిసేపు వారంతా ఘర్షణ పడినట్లుగా సమాచారం. ఏం జరిగిందనేది పోలీసులు వెల్లడించలేదు.

ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో సొమ్మసిల్లి పడిపోయిన సాయిప్రియ

ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో సొమ్మసిల్లి పడిపోయిన సాయిప్రియ

ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో సాయి ప్రియ సొమ్మసిల్లి కొద్దిసేపు పడిపోయారని సమాచారం. వారిచ్చిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వారిని ఇంటికి పంపించేశారు. ఇక ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన సాయి ప్రియను, రవిని మీడియా ప్రశ్నించగా సాయి ప్రియ స్పందించలేదు. రవి స్పందించి మమ్మల్ని క్షమించండి అంటూ విజ్ఞప్తి చేశారు.

మా వల్ల కోటి రూపాయలు ప్రభుత్వం నష్టపోయింది .. మమ్మల్ని క్షమించండి : రవి

మా వల్ల కోటి రూపాయలు ప్రభుత్వం నష్టపోయింది .. మమ్మల్ని క్షమించండి : రవి

మా వల్ల కోటి రూపాయలు ప్రభుత్వం నష్టపోయిందని పేర్కొన్న రవి మా ఇద్దరి తరపున క్షమాపణ కోరుకుంటున్నాను అంటూ వెల్లడించారు. సాయిప్రియకు శ్రీనివాస్ తో పెళ్లి ఇష్టం లేదని చాలాసార్లు చెప్పిందని, చిన్నప్పటినుంచి తామిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నామనీ రవి వెల్లడించారు. ఇక సాయి ప్రియ భర్త ఇచ్చిన రెండు గాజులు ఏం చేశారు అని ప్రశ్నించిన మీడియాకు ఆ గాజులు తమ దగ్గరే ఉన్నాయని, సాయి ప్రియ చేతికి ఉన్నాయని వాటిని తిరిగి వాళ్లకి ఇచ్చేస్తామంటూ పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్ కు రాని సాయిప్రియ భర్త ... సాయిప్రియ కథ కంచికి

పోలీస్ స్టేషన్ కు రాని సాయిప్రియ భర్త ... సాయిప్రియ కథ కంచికి


ఇక తాను చదువుకున్నా అని తన భార్యను పోషించుకోగలనని, ఎవరితోనూ సంబంధం లేకుండా మేమిద్దరం బ్రతకగలమని రవి వెల్లడించారు. మొత్తానికి సాయి ప్రియను, రవిని విశాఖకు తీసుకురావడంతో సాయి ప్రియ మిస్సింగ్ కథ కంచికి చేరింది. ఇద్దరు మేజర్లు కావడంతో ప్రియుడుతోనే సాయిప్రియను పంపించారు పోలీసులు. ఇక ఈ కేసులో సాయి ప్రియ భర్త శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ కు కూడా రాలేదు.

English summary
Police brought Sai Priya and her lover Ravi to Visakha from Bangalore who went missing in Visakha Beach. They spoke to their families at Visakhapatnam Airport. A high drama happened there. Finally they apologized to the government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X