Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్ర అఫిడవిట్ పై కార్మికుల కన్నెర్ర .. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత ; భారీగా పోలీసుల పహారా !!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉధృతం రూపం దాల్చాయి. నిన్న కేంద్రం ఏపీ హైకోర్టు కు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో అఫిడవిట్ దాఖలు చేయడంతో అఫిడవిట్ లో కేంద్రం పేర్కొన్న అంశాలను నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం వద్ద కార్మిక నేతలు ఆందోళన చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి తీరుతామని, అవసరమైతే ఉద్యోగులను తొలగిస్తామని ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ పై ఉద్యోగ కార్మిక సంఘాల నేతలు భగ్గుమంటున్నారు.

Recommended Video

    Vizag Steel Plant : కార్మికుల పోరాటం ఉధృతరూపం.. జగన్ సర్కార్ పై ఒత్తిడి..!!

    విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం వద్ద ఆందోళన

    విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం వద్ద ఆందోళన

    విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం వద్ద ఆందోళనకు దిగిన విశాఖ ఉక్కు కార్మికులు, ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కార్మికుల ఆందోళనలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లోపలికి విధులకు వెళుతున్న కార్మికులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టీల్ ప్లాంట్ వద్ద పెద్ద సంఖ్యలో సిఐఎస్ఎఫ్ బృందాలు పహారా కాస్తున్నాయి. భారీగా మోహరించిన పోలీసులు స్టీల్ ప్లాంట్ వద్ద కాపలా కాస్తున్నారు.

     భారీగా ఆందోళనలో కార్మికులు, ఉద్యోగులు

    భారీగా ఆందోళనలో కార్మికులు, ఉద్యోగులు

    స్టీల్ ప్లాంట్ వద్ద కొనసాగుతున్న ఆందోళనలో భారీగా కార్మికులు, ఉద్యోగులు భాగస్వామ్యం తీసుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అంగీకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇదిలా ఉంటే జనవరిలో కేంద్రం నిర్ణయం తీసుకున్న నాటినుండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని విశాఖ కేంద్రంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపనలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ మినహాయించి అన్ని పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నాయి.అధికార పార్టీ సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికుల పక్షాన నిలబడి పోరాటం సాగిస్తామని బాహాటంగానే వెల్లడించింది.

     ఏపీ హైకోర్టుకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం అఫిడవిట్

    ఏపీ హైకోర్టుకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం అఫిడవిట్

    ఇప్పటికే పలుమార్లు పార్లమెంటు సమావేశాలలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఈ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించి తీరుతామని కేంద్రం స్పష్టం చేసింది. ఇక తాజాగా హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కూడా, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే పూర్తి అధికారం కేంద్రానికి ఉందని, ఈ విషయంలో పునరాలోచన చేయడానికి ఏమీ లేదని, ప్రైవేటీకరణ చేసి తీరుతామని మరోమారు అఫిడవిట్ ద్వారా కేంద్రం స్పష్టం చేసింది.

     అఫిడవిట్ పై భగ్గుమన్న కార్మిక లోకం .. ఉధృతంగా ఆందోళన

    అఫిడవిట్ పై భగ్గుమన్న కార్మిక లోకం .. ఉధృతంగా ఆందోళన

    దీంతో విశాఖ ఉక్కు కార్మికులు భగ్గుమంటున్నారు. ఆందోళనను తీవ్రతరం చేయాలని నిర్ణయించి,పెద్ద ఎత్తున విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం ముందు ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. ఎంత వరకైనా వెళ్తాం , ప్రాణాలైనా అర్పిస్తాం .. స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తాం అంటూ నినదిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు ఎవరైనా వస్తే వారిని అడ్డుకుంటామని తేల్చి చెప్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేస్తూ కేంద్రం దిగి రావాలని డిమాండ్ చేస్తున్నారు

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+