ఉధృతంగా విశాఖ ఉక్కు ఉద్యమం ; బైక్ ర్యాలీలు, రాస్తా రోకోలు.. జగన్ సర్కార్ పై ఒత్తిడి !!
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభించిన కేంద్రం తీరుకు నిరసనగా విశాఖలో ఉక్కు ఉద్యమం ఉధృతమవుతోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా కార్మికులు చేస్తున్న పోరాటం రోజురోజుకూ ఉధృతరూపం దాలుస్తోంది. ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంతో, కేంద్రం చర్యలను నిరసిస్తూ విశాఖలో ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి. తాజా పరిస్థితులు జగన్ సర్కార్ పై ఒత్తిడి పెంచుతున్నాయి.
Recommended Video

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీలు , రాస్తారోకోలు
ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెం కూడలి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ,అఖిలపక్ష కార్మిక నాయకులు, కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు చప్పుళ్ళతో ఉద్యమాన్ని హోరెత్తించారు . భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోబోమని తేల్చి చెప్పారు .ఇక పలువురు ఉద్యోగులు, కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు.

విశాఖ ఉక్కు ఉద్యమానికి 100 రోజులు .. భారీ సభ ఏర్పాటు
ఇప్పటికైనా కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలతో ర్యాలీ ర్యాలీ నిర్వహించడం కాకుండా గత 100 రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో వందరోజులు పూర్తయిన సందర్భంగా భారీ సభను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కోసం కేంద్రంపై పోరాటం చేయాలని వారిని కోరుతున్నారు.

స్టీల్ ప్లాంట్ అమ్మకానికి రంగం సిద్ధం .. అడ్డుకుంటాం అంటున్న కార్మిక సంఘాలు
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం న్యాయ సలహాదారు, లావాదేవీలు సలహాదారులను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసిన కేంద్రం, ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టెండర్లను ఆహ్వానించింది. అయితే కార్మికులు స్టీల్ ప్లాంట్ కొనటానికి ఎవరు వచ్చినా అడ్డుకుని తీరుతామని స్పష్టం చేస్తున్నారు. బిజెపి మినహాయించి అన్ని పార్టీల నేతలు ప్రైవేటీకరణ వద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా, కార్మికులు గత వంద రోజులుగా ఆందోళనలు చేస్తున్నా అవేవీ పట్టించుకోకుండా కేంద్రం మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు వేస్తుంది.

ఏపీ సర్కార్ పై పెరుగుతున్న ఒత్తిడి .. జగన్ సర్కార్ కు ఇదో తలనొప్పి
ఈ నేపథ్యంలోనే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, కేంద్రం పై పోరాటం చేసి ప్రైవేటీకరణను ఆపాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు. వీరి పోరాటానికి బిజెపి మినహాయించి అఖిలపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి.ఇక మరోమారు ఉధృతం అవుతున్న విశాఖ ఉక్కు ఉద్యమం ఏపీ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా తయారైంది. అధికార పార్టీ నేతలపై ఒత్తిడి పెంచుతుంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications