ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కురుపాం నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న లో భాగంగా పూర్వం ఉన్న నాగూరు నియోక‌వ‌ర్గాన్ని పేరు మార్చి కురుపాం నియోజ‌క వ‌ర్గంగా మార్చారు. పున‌ర్విభ‌జ‌న త‌రువాత కొమ‌రాడ‌, గ‌రుగుబిల్లి మండ‌లాలు రెండు పూర్తిగా కుర‌పాంలో క‌లిసాయి. ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో శ‌త్రుచ‌ర్ల కుటుంబం తొలి నుండి రాజ‌కీయంగా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది. శ‌త్రుచ‌ర్ల ఆరు సార్లు ఎమ్మె ల్యేగా గెలిచారు. నాగూరు లో నాలుగు సార్లు, పార్వ‌తీ పురం, పాత‌ప‌ట్నం లో ఒక సారి చొప్పున విజ‌యం సాధించారు. ఇక‌, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2009లో కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా గెలిచిన జ‌నార్ధ‌న థాట్రాజ్ 2014 ఎన్నిక‌ల ముందు టిడిపిలో చేరారు. ఈ య‌న 2014 ఎన్నిక‌ల ముందు శ‌త్రుచ‌ర్ల‌తో క‌లిసి టిడిపి లో చేరారు. ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం కావ‌టంతో ఇక్క‌డ సీపియం కూడా ప‌ట్టు కొన‌సాగిస్తోంది. ఇక‌, 2014 ఎన్నిక‌ల నాటికి ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసిపి ఆధిపత్యం మొద‌లైంది.

నాగూరు లో 11 సార్లు..కురుపాంలో రెండు సార్లు..
నాగూరు లో 11 సార్లె ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్య‌ర్ధులు గెలిచారు. టిడిపి, సిపిఎం, జ‌న‌తా పార్టీలు ఒక్కో సారి గెలుపొందాయి. రెండు సార్లు స్వ‌తంత్ర అభ్య‌ర్ధులు గెలుపొందారు. 2009 లో నియెజ‌క‌వ‌ర్గ పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ఏర్ప‌డిన కురుపాం నియోక‌వ‌ర్గం లో కాంగ్రెస్ ఒక‌సారి, వైసిపి ఒక‌సారి గెలుపొందాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో సిపిఎం నేత గా ఉన్న లక్ష్మ‌ణ మూర్తి 2004 ఎన్నిక‌ల్లో గెలుపొందారు. ఇక్క‌డి నుండి ఎమ్మెల్యేగా గెలిచిన శ‌త్రుచ‌ర్ల విజ‌య‌రామ‌రాజు ఎంపీగానూ గెలుపొందారు. శ‌త్రుచ‌ర్ల సోద‌రుడు చంద్ర‌శేఖ‌ర రాజు కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డి రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోయాయి.

#AndhraPradeshElections2019: All about kurupam Constituency

2014 లో వైసిపి అభ్య‌ర్ధి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం 176271 ఓట్లు ఉండ‌గా, అందులో 131177 ఓట్లు పోల‌య్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన పుష్ప శ్రీ వాణికి 56435 ఓట్లు రాగా, టిడిపి అభ్య‌ర్ధి జ‌నార్ధ‌న్ థ్రాట్రాజ్ కు 36352 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి రెబ‌ల్ గా పోటీ చేసిన నిమ్మ‌క జ‌య‌రాజ్ కు 26044 ఓట్లు వ‌చ్చాయి. ఈ ఎన్నిక‌ల్లో వైసిపి అభ్య‌ర్ధి పుష్ప శ్రీ వాణి టిడిపి అభ్య‌ర్ధి పై 19083 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నిక‌ల్లో ఎస్టీ నియోక‌వ‌ర్గాల్లో వైసిపి అధిప‌త్యం క‌నిపించింది. కురుపాం నుండి ఎన్నికైన పుష్ప శ్రీ వాణి పార్టీ అధినేత జ‌గ‌న్ కు విధేయురాలిగా ఉంటున్నారు. టిడిపి నుండి పార్టీలోకి రావాల‌ని ఆహ్వా నాలు ప‌లుమార్లు వ‌చ్చినా..తిర‌స్క‌రించారు. దీంతో..పుష్ప శ్రీ వాణికి తిరిగి టిక్కెట్ ద‌క్క‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. శ‌త్రుచ‌ర్ల కుటుంబం ఎస్టీ కాద‌ని..క్ష‌త్రియుల‌నే అభియోగం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+