పంచాయతీ పోరు .. బొత్సా టార్గెట్ గా విజయనగరం వైసీపీలో ఇంటర్నల్ వార్ .. నెల్లిమర్ల ఎమ్మెల్యే ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇప్పటికే పలు జిల్లాలలో వర్గ విభేదాలతో ఏకగ్రీవాలు చేయడం మంత్రులకు, ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఇదే సమయంలో విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పై వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వైసిపి వర్గాల్లోనూ, ఇతర రాజకీయ పార్టీల లోనూ ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.
Recommended Video


బొత్సా సోదరుడు టీడీపీతో కలిసి ఏకగ్రీవాలను అడ్డుకుంటున్నారన్న ఎమ్మెల్యే
మంత్రి బొత్స సత్యనారాయణ పై ఆయన సమీప బంధువు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు నెల్లిమర్ల నియోజకవర్గం లో రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నేతలతో కలిసి విపరీతంగా డబ్బులు పంచి ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు.

అన్నదమ్ములకి, వదినకి పదవులున్నా సంతృప్తి లేదా అని బొత్సా సోదరుడిపై ఫైర్
గత ఎన్నికల్లో తనకు వచ్చిన 30 వేల మెజారిటీ చూసి ఓర్వలేక రాజకీయ చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రమంతా పరిస్థితి ఒకలా ఉంటే తన నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బడుకొండ అప్పలనాయుడు . అన్నదమ్ములకి, వదినకి పదవులున్నా సంతృప్తి చెందకుండా లక్ష్మణరావు రాజకీయ ఉన్మాదిగా మారారని, తన నియోజకవర్గంలో రాజకీయంగా చిచ్చు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు నెల్లిమర్ల ఎమ్మెల్యే.

బొత్స సత్యనారాయణ తన సోదరుని కంట్రోల్ చేయలేకపోతున్నారని మండిపడిన ఎమ్మెల్యే
ఇక పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన సోదరుని కంట్రోల్ చేయలేకపోతున్నారని మండిపడ్డారు. ఎన్నికల తరువాత తాను అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని, అటోఇటో తేల్చుకుంటామని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలో పొడసూపుతున్న వర్గ విభేదాలు అటు పార్టీ వర్గాలలోనూ, ప్రతిపక్ష పార్టీలోనూ ఆసక్తికరంగా మారాయి. ఏకంగా మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాలోనే వైసిపి రెండు గ్రూపులుగా మారడం, తీవ్ర వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా బొత్స సోదరుడిని టార్గెట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications