అశోక్‌గ‌జ‌పతిరాజుపై కేసు న‌మోదు.. అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్ర‌చారం.. విజ‌య‌న‌గ‌రంలో టెన్ష‌న్ టెన్ష‌న్‌

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రామతీర్థంలో చోటుచేసుకున్న వివాదం పెను దుమారం రేపుతోంది. అధికార, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ మధ్య మాటల యుధ్దం నడుస్తోంది. తాజాగా కేంద్ర మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీసుస్టేషన్‌లో కేసు న‌మోదైంది..

 అశోక్‌గ‌జ‌పతిరాజుపై కేసు.. అరెస్ట్ చేస్తారంటూ ప్ర‌చారం ..

అశోక్‌గ‌జ‌పతిరాజుపై కేసు.. అరెస్ట్ చేస్తారంటూ ప్ర‌చారం ..

రామతీర్థంలో ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి , తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అశోక్ గజపతిరాజుపై పోలీసులకు ఆలయ ఈవో ఫిర్యాదు చేశారు. అనువంశిక ధర్మకర్త‌గా ఉన్న ఆయ‌నికి ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని ఫిర్యాదులో ఈవో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు అశోక్ గజపతిరాజుపై సెక్ష‌న్ 353, 473 కింద కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరి కొందరిపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. దీంతో అశోక్‌గ‌జ‌ప‌తిరాజును అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో విజయనగరం జిల్లాలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

 రామ‌తీర్థం కొండ‌పై ఏం జ‌రిగింది..?

రామ‌తీర్థం కొండ‌పై ఏం జ‌రిగింది..?

విజయనగరంజిల్లా రామతీర్థం బోడికొండపై బుధవారం రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ స‌మయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. తనను కొబ్బరికాయ కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అశోక్‌ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగారు. శిలా ఫలకం బోర్డును తొలగించే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలకు ఆయనకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో కొండ‌పై ఒక్కసారిగా ఉదిక్తత వాతావరణం నెలకొంది. రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలకు సర్థిచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు.

వైసీపీ, టీడీపీ నేత‌ల‌ మధ్య మాట యుద్ధం..

వైసీపీ, టీడీపీ నేత‌ల‌ మధ్య మాట యుద్ధం..

ఈ ఘటనపై అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష‌ టీడీపీ నేత‌ల‌ మధ్య మాట యుద్ధం నడిసింది. అసలు తప్పంతా అశోక్ గజపతిరాజుదేనని వైసీపీ నేతలు.. చేసిందంతా మంత్రులేనని టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోణలు గుప్పించుకున్నారు. మంత్రుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేతలు మండిపడ్డారు. అటు కోదండరాముని ఆలయం వ్యవహామంతా మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిందని.. ఇందులో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధంలేదని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని 400 సంవత్సరాల కిందట తమ పూర్వీకులు నిర్మించార‌ని తెలిపారు. ప్రభుత్వం తమపై క‌క్ష‌ పూరితంగా వ్యహరింస్తోందని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+