వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నగ్నంగా మార్ఫింగ్ చేసిన ఫొటోలతో లోన్‌యాప్ వేధింపులు: యువకుడు ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

వరంగల్: ఆన్‌లైన్ లోన్ యాప్‌‌ల ఆగడాల కట్టడికి ప్రభుత్వం, పోలీసులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా.. వాటి వేధింపులతో యువత బలవుతూనే ఉన్నారు. తాజాగా, మరో యువకుడు ఆన్‌లైన్ యాప్‌ల వేధింపులకు బలయ్యాడు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

కొత్తకోటకు చెందిన 35 ఏళ్ల శేఖర్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుండేవాడు. ఈ క్రమంలో లోన్ యాప్‌ల గురించి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అందులో అప్పు తీసుకుని కొంత కాలం తర్వాత తిరిగి చెల్లించాడు. అయినప్పటికీ.. ఇంకా వడ్డీ చెల్లించాల్సి ఉందంటూ లోన్ యాప్ నిర్వాహకులు శేఖర్‌ను వేధించడం మొదలుపెట్టారు.

Another youth commits suicide due to loan app harassment

అంతేగాక, శేఖర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేగాక, నగ్నంగా మార్ఫింగ్ చేసి అతని కుటుంబసభ్యులు, ఇతర స్నేహితులకు పంపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు సోమవారం ఉదయం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

శేఖర్ మృతితో ఆయన కుటుంబంతోపాటు, స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Another youth commits suicide due to loan app harassment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X