వరంగల్లో చిరంజీవి వాల్తేరు వీరయ్య ఫీవర్: నేడు ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో మెగా బాస్‌పార్టీ!!

ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ విజయోత్సవ వేడుక నిర్వహించనున్నారు. దీంతో వరంగల్ నగర వ్యాప్తంగా వాల్తేరు వీరయ్య ఫీవర్ పట్టుకుంది.

ఇప్పుడు వరంగల్లో వాల్తేరు వీరయ్య ఫీవర్ పట్టుకుంది. ఈరోజు సాయంత్రం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ సంబరాలు నిర్వహించనున్న నేపథ్యంలో చిరంజీవి అభిమానులు మెగాస్టార్ చిరంజీవి రాక కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. తన నటనతో ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేసే చిరంజీవి వాల్తేరు వీరయ్యలోనూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను కట్టి పడేశారు. అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా విజయోత్సవాన్ని చారిత్రక ఓరుగల్లు అభిమానుల మధ్య జరుపుకోనున్నారు.

బాక్సాఫీస్ బద్దలు కొట్టి బిగ్గెస్ట్ హిట్ అయిన వాల్తేరు వీరయ్య

బాక్సాఫీస్ బద్దలు కొట్టి బిగ్గెస్ట్ హిట్ అయిన వాల్తేరు వీరయ్య

మెగాస్టార్ చిరంజీవి తన నూట యాభై నాలుగవ చిత్రంగా యువ దర్శకుడు బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాలో తన నటనతో అదరగొట్టారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా జనవరి 13న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి, శృతి హాసన్ జంటగా, మాస్ మహరాజా రవి తేజ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమా మిగతా సినిమాలతో పోలిస్తే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ ను బద్దలు కొట్టి భారీ వసూళ్లను రాబట్టింది.

వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభ

వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభ

మెగాస్టార్ చిరంజీవి మాస్ క్యారెక్టర్ చేసిన ఏ సినిమా అయినా సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే. ఇక వాల్తేరు వీరయ్య కూడా అదే ఖాతాలో చేరిపోయింది. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది వాల్తేరు వీరయ్య.

ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ విజయోత్సవ వేడుక నిర్వహించనున్నారు. దీంతో వరంగల్ నగర వ్యాప్తంగా వాల్తేరు వీరయ్య ఫీవర్ పట్టుకుంది. ఎప్పుడెప్పుడు చిరంజీవిని చూద్దామా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు.. పాల్గొననున్న చిరంజీవి, రాం చరణ్, రవితేజ

ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు.. పాల్గొననున్న చిరంజీవి, రాం చరణ్, రవితేజ

ఇప్పటికే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభ కోసం భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ మహారాజ రవితేజ పాల్గొననున్నట్టు సమాచారం. ఇక ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరవుతారని తెలుస్తుంది. వరంగల్ నగరంలో మొదటి నుంచి చిరంజీవికి అభిమానులు ఎక్కువ. చిరంజీవి సినిమా ఏది రిలీజ్ అయినా వరంగల్ జిల్లా వాసులు ఆయన సినిమాకు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు.

 వరంగల్ లో నేడు డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్

వరంగల్ లో నేడు డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్

చిరంజీవి సినీ ప్రస్థానం ప్రారంభించి ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయనకు ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫాన్స్ ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక మరో పక్క చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్లో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. దీంతో చిరంజీవి విజయోత్సవ సభ వరంగల్లో నిర్వహించనున్న నేపథ్యంలో వరంగల్ వాసుల పరిస్థితి ఎలా ఉంది అంటే.. డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్ అన్నట్టు ఉందని చెప్పాలి.

ఇక ఈరోజు బాస్ పార్టీలో వాల్తేరు వీరయ్య సక్సెస్ ని ఎంజాయ్ చేయడానికి పెద్ద ఎత్తున యూత్ తరలి రానున్నట్టు సమాచారం.ఇప్పటినుండే వరంగల్ వాసులు వాల్తేరు వీరయ్య చిరంజీవిని చూడటానికి రెడీ అవుతూరోడ్లపై హడావిడి మొదలెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+