సర్కారీ దవాఖానలో కలెక్టరమ్మ డెలివరీ.. తల్లీ బిడ్డ సేఫ్, ఎక్కడంటే..?
సర్కార్ దవాఖానలో వైద్యం అంటే మరింత నమ్మకం కలగాలి.. అంటే అధికారులో.. నేతలు వైద్యం చేయించుకోవాలి. అయితే తొలి నుంచి సర్కారీ వైద్యం అంటే కాస్త నిర్లక్ష్యం ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇదీ రుజువు అయ్యింది కూడా.. ఇప్పుడు ఓ ఐఏఎస్ అధికారి సర్కారీ ఆస్పత్రిలో డెలివరీ అయ్యింది.
తెలంగాణకు చెందిన మహిళా ఐఏఎస్ అధికారిణి త్రిపాఠి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకున్నారు. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన త్రిపాఠి ములుగు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాకు పొరుగునే ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా ఆమె భర్త భవేశ్ మిశ్రా పనిచేస్తున్నారు.

త్రిపాఠికి సోమవారం రాత్రి పురిటి నొప్పులు ప్రారంభం కాగా... ఆమెను భవేశ్ మిశ్రా భూపాలపల్లిలోని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ సంజీవయ్య ఆసుపత్రిలో పనిచేస్తున్న గైనకాలజిస్ట్‌ను రప్పించారు. సాధారణ ప్రసవానికే వైద్యులు యత్నించగా.. గర్భంలోని మగ శిశువు బరువు అధికంగా ఉండటంతో సోమవారం రాత్రి సిజేరియన్ ఆపరేషన్ చేసి..ప్రసవం చేశారు.
This is proof of the quality treatment provided in Government hospitals under #KCR's rule👇
— Jagan Patimeedi (@JAGANTRS) October 4, 2022
Mulugu Additional Collector Tripathi gave birth to a baby boy at a government area hospital#Telangana @KTRTRS @trsharish pic.twitter.com/dRbWBzPOQh
ప్రసవం తర్వాత తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. రాష్ట్రంలో సర్కారీ ఆసుపత్రుల్లో పెరిగిన వసతులకు నిదర్శనం ఈ ఘటన అని టీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications