సర్వం శివోహం: శోభాయమానంగా వెయ్యిస్తంభాల ఆలయం; ఓరుగల్లులోని చారిత్రక ఆలయాల్లో పోటెత్తిన భక్తజనం!!
మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. వరంగల్లోని చారిత్రక శైవ క్షేత్రాలు వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి, మొదలైన ఆలయాల్లో వేడుకలు జరుగుతున్నాయి. భక్తుల రద్దీ కొనసాగుతుంది.
నేడు శివరాత్రి పర్వదినం కావడంతో భక్తవ శంకరుడు, భోళా శంకరుడు అయిన ఆ పరమశివుని దర్శించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక శివాలయాలకు భక్తజనులు పోటెత్తుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.

ఓరుగల్లు లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
ముఖ్యంగా కాకతీయ రాజులు పరిపాలించిన ఓరుగల్లు జిల్లాలో అత్యంత ఘనంగా శివరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక వేయి స్తంభాల ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఈరోజు తెల్లవారుజాము నుండే స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు కొనసాగుతున్నాయి. చారిత్రక వేయి స్తంభాల దేవాలయానికి శివయ్యను దర్శనం చేసుకోవడానికి భక్తజనులు బారులు తీరారు.

వేయి స్తంభాల గుడికి పోటెత్తిన భక్తులు
లక్షల సంఖ్యలో ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వేయి స్తంభాల ఆలయానికి వస్తారు కాబట్టి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రుద్రేశ్వరస్వామి గా పూజలందుకుంటున్న ఆ పరమ శివుని దర్శనానికి ఒక్క ఓరుగల్లు నుండి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.
రాత్రి జాగరణ ఉండే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల శివరాత్రి జాగారాలతో దేవాలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. ప్రతి ఏటా ఘనంగా వేయి స్తంభాల దేవాలయంలో మహా శివరాత్రి పర్వదినాన వేడుకలు విశేషంగా జరుగుతున్నాయి.

ఓరుగల్లు జిల్లా వ్యాప్తంగా ప్రముఖ శైవ క్షేత్రాలు.. కన్నుల పండుగగా సంబరాలు
హనుమకొండలోని రుద్రేశ్వర స్వామి వారి వెయ్యి స్తంభాల దేవాలయం మాత్రమే కాకుండా, రామప్ప దేవాలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వర ఆలయం, పద్మాక్షి వద్ద ఉన్న సిద్దేశ్వరాలయం, కటాక్షపురంలోని శివకేశవాలయాలు, కాశిబుగ్గలోని కాశీ విశ్వేశ్వరాలయం, పాలకుర్తిలోని సోమేశ్వరాలయం, వరంగల్ కోట లోని నేల శంభుని గుడి, అయినవోలు మల్లన్న ఆలయం, కురవి వీరభద్ర స్వామి ఆలయం ఇలా ప్రముఖ శైవ క్షేత్రాలలో శివరాత్రి సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి జాతర అన్ని ప్రముఖ ఆలయాలలోనూ కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శోభాయమానంగా కనిపిస్తున్నాయి.

ఓరుగల్లులోని చారిత్రిక ఆలయాలన్నీ కాకతీయుల కాలం నాటివే
కాకతీయులు పరిపాలించిన ఓరుగల్లులో గణనీయంగా శైవ క్షేత్రాలు ఉన్నాయి. కాకతీయ రాజులూ ఏక, ద్వి, త్రి కూట మరియు పంచకూట ఆలయాలను నిర్మించారు. ముఖ్యంగా కాకతీయ రాజులు శివారాధకులు కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకతీయుల కాలంలో అనేక ప్రసిద్ధ శైవ క్షేత్రాలను వారు నిర్మించారు. అవి నాటినుండి నేటి వరకు శివారాధకులతో విశేషంగా పూజలను అందుకుంటూ, శివనామస్మరణతో మారు మోగిపోతున్నాయి.

యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయంలో సైతం శివరాత్రి పర్వదినం సందర్భంగా ఘనంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుండి రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజధికాలను నిర్వహిస్తున్నారు. కాకతీయుల నిర్మించబడిన ఈ దేవాలయం ఇటీవల యునెస్కో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.
రామప్ప ని శిల్పి నిర్మాణం చేయడం వల్ల రామప్ప దేవాలయం గా ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయంలో మహా రాత్రి శివరాత్రి సందర్భంగా స్వామి వారి పూజలతో పాటు, జాగరణ చేసే భక్తుల కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక రామప్ప దేవాలయానికి సైతం శివ భక్తులు పోటెత్తుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఎక్కువ శివాలయాలే .. అంతా శివ ధ్యానమే
ఇదిలా ఉంటే స్వయంభువుగా వెలిసిన పద్మాక్షి గుట్ట వద్ద ఉన్న సిద్దేశ్వర స్వామి ఆలయంలో కూడా మహాశివరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సిద్ధేశ్వర స్వామికి ఈరోజు తెల్లవారుజాము నుండే అభిషేకాలు చేస్తూ భక్తులు ఆ శివుడి కటాక్షం కోసం పూజాధికారులు నిర్వహిస్తున్నారు.
సిద్దేశ్వరాలయంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా చేశారు భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి కటాక్ష పూర్ లోని శివ కేశవాలయాలలో సైతం వేడుకలు నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. మరోపక్క వరంగల్ కాశిబుగ్గలోని కాశీ విశ్వేశ్వర ఆలయం, కురవి మండలంలోని వీరభద్ర స్వామి ఆలయం, అయినవోలులోని మల్లన్న దేవాలయం, పాలకుర్తి లోని సోమన్న దేవాలయం, మెట్టుగుట్టపై ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.
ఇక ఆయా శివాలయాలకు ఈరోజు తెల్లవారుజామునుండే భక్తులు పోటెత్తడంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. సర్వం శివోహం అన్నట్టుగా కనిపిస్తుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications