ఆదివారం నిశ్చితార్ధం.. అంతలోనే తీరని విషాదం; వరంగల్ లో పాతభవనం కూలి ఇద్దరు మృతి

వరంగల్: వరంగల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్ లో విపరీతంగా కురుస్తున్న వర్షంతో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని మండీ బజార్ లోని రెండు పురాతన శిథిలావస్థకు చేరుకున్న భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఒకరికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో అత్యంత విషాదకరమైన అంశం మృతి చెందిన యువకుడికి, ఆదివారం నాడు నిశ్చితార్థం చేయాలని నిర్ణయించారు. ఇంతలోనే దారుణం జరిగిపోయింది.

వర్షం కారణంగా భవనం కూలి ఇద్దరు మృతి

ఇంతెజార్ గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగరాజు వర్షం కారణంగా ఇద్దరు మృతి చెందిన ఘటనకు సంబంధించి తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేబల్లె గ్రామానికి చెందిన 60 సంవత్సరాల వయసున్న తిప్పారపు పైడి, మండి బజార్ లో నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి వాచ్మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనతో పాటు సలీమా అనే మహిళ కూడా అక్కడే పని చేస్తున్నారు. వారిద్దరూ భవనం పరిసర ప్రాంతంలోనే గుడిసెలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం సలీమా కుమారుడు 22 సంవత్సరాల ఫిరోజ్ ఆమెను చూడడం కోసం నగరానికి వచ్చాడు.

పాతభవనం కూలి గుడిసెపై పడటంతో ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

పాతభవనం కూలి గుడిసెపై పడటంతో ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

భారీ వర్షం కురుస్తున్న కారణంగా శనివారం తెల్లవారుజామున గుడిసె పక్కనే ఉన్న పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ భవనానికి చెందిన గోడలు సలీమా నివసిస్తున్న గుడిసె పై పడడంతో, పైడి, ఫిరోజ్ లు మృతి చెందారు. సంఘటనా స్థలంలోనే వారిద్దరూ మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన సలీమాను స్థానికుల సహాయంతో పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో సలీమా చికిత్స పొందుతోంది.

వివాహం నిశ్చయం కాగా .. నిశ్చితార్ధం షాపింగ్ కు వచ్చిన ఫిరోజ్ మృతి

వివాహం నిశ్చయం కాగా .. నిశ్చితార్ధం షాపింగ్ కు వచ్చిన ఫిరోజ్ మృతి

ఇక సలీమా కుమారుడు ఫిరోజ్ తొర్రూరు మండలం మాటేడు గ్రామంలో నివసిస్తున్నాడు. ఫిరోజ్ కు ఈ మధ్య వివాహం నిశ్చయమైంది. ఆదివారం నాడు నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఇక నిశ్చితార్థానికి సంబంధించిన షాపింగ్ చేయడం కోసం ఫిరోజ్ నగరానికి వచ్చి తల్లి వద్ద ఉన్నాడు. ఈ క్రమంలోనే దురదృష్టవశాత్తు గోడకూలి మృతి చెందాడు.

నిశ్చితార్థం చేసుకోవలసిన ఫిరోజ్ అర్దాంతరంగా జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం స్థానికుల మనసును కలచివేసింది. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక సంఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరిశీలించారు. పురాతన శిధిలావస్థకు చేరిన భవనాలలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+