సీనియర్ వేధింపులతో మెడికో ప్రీతి మృతి: నోరు జారిన డాక్టర్, నిమ్స్ వద్ద ఆందోళనలు, ఉద్రిక్తత

సీనియర్‌ వేధింపులు తట్టుకోలేక వరంగల్‌ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందింది.

హైదరాబాద్: సీనియర్‌ వేధింపులు తట్టుకోలేక వరంగల్‌‌లో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందింది. ఐదు రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచిందని వైద్యులు ప్రకటించారు. బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె చనిపోయిందని తెలిపారు.

నిమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

నిమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

ఈ క్రమంలో నిమ్స్ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ప్రీతి మృతితో నిమ్స్ ఆస్పత్రి వద్ద వివిధ సంఘాలు, పార్టీల నేతలు ఆందోళనలు చేపపట్టారు. మంత్రీ కేటీఆర్ వచ్చే వరకూ ప్రీతి మృతదేహాన్ని ఇక్కడ్నుంచి కదిలించి లేదంటూ నినాదాలు చేస్తున్నారు. రూ. 5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ప్రీతి మృతదేహాన్ని తరలించేందుకు ఆస్పత్రి వర్గాలు, అధికారులు చర్యలు చేపట్టారు. ప్రీతి మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళన చేస్తున్నవారిని అరెస్ట్ చేసి.. పోలీసులు తమ వాహనాల్లో స్టేషన్లకు తరలిస్తున్నారు.

ప్రీతి ఇంజెక్షన్ తీసుకున్నది అనేది కట్టుకథే..

ప్రీతి ఇంజెక్షన్ తీసుకున్నది అనేది కట్టుకథే..

ప్రీతి ఇంజెక్షన్ తీసుకున్నది అనేది కట్టుకథే అని ప్రభుత్వ వైద్య అసోసియేషన్ సభ్యులు అన్నారు. ఎవరో స్క్రిప్ట్ రాస్తే ఇక్కడ చదువుతున్నారని మండిపడ్డారు. ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితురాలు, ఆమె తండ్రి ఫిర్యాదు చేసినా.. అడ్మిస్ట్రషన్, హెచ్ఓడీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రీతి బాడీని ప్యాక్ చేయాలా? అంటూ నోరు జారిన డాక్టర్లు

ప్రీతి మృతి చెందిందన్న వార్త వినగానే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం జరగకుండా ప్రీతి మృతదేహాన్ని తీసుకునేది లేదని కుటుంబసభ్యులు స్పష్టం చేశారు. దీంతో ప్రీతి బాడీని ప్యాక్ చేసి పంపాలా? అంటూ ఓ డాక్టర్ నోరు జారారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు.

బాధ్యులపై చర్యలకు ప్రీతి తల్లిదండ్రుల డిమాండ్

ఈ నేపథ్యంలో ప్రీతి కుటుంబానికి నచ్చచెప్పేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారు. హెచ్ఓడీ, ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలన్నారు ప్రీతి తండ్రి. వీరిని సస్పెండ్ చేయకుండా విచారణ జరిగితే అన్యాయమేనని అన్నారు. నిందితుడు సైఫ్‌కు మద్దతుగా సీనియర్లతో హెచ్ఓడీ స్ట్రైక్ చేయిస్తున్నారని ఆరోపించారు. నిందితుడు సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంసీ సీతారాం నాయక్ ఆస్పత్రికి వచ్చి ప్రీతి తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ప్రీతి మృతి కారణాలేంటని, ఏం వైద్యం చేశారని వైద్యులను ప్రశ్నించారు ప్రీతి తండ్రి. తమకు అన్ని సమాధానాలు వచ్చాకే ఇక్కడ్నుంచి కదులుతామన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని.. తాము ఇక్కడ్నుంచి కదలమని.. సమాధానం రాకుంటే తాము కూడా ఇక్కడే తనువు చాలిస్తామని ప్రీతి తండ్రి వాపోయారు.ప్రీతి ఆత్మహత్య కాదని, కమిటీ వేసి దర్యాప్తు జరపాలన్నారు.

ప్రీతి మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తరలించే ప్రయత్నం చేయగా.. ఆమె తల్లిదండ్రులు అడ్డుకున్నారు. వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీనియర్ వేధింపులతో ప్రీతి ఆత్మహత్య

కాగా, కాకతీయ వైద్యకళాశాలలో పీజీ మత్తు వైద్యం (అనస్థీషియా) ఫస్టియర్‌ చదువుతున్న విద్యార్థిని ప్రీతిని.. సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె హానికరమైన ఇంజెక్షన్‌ చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రీతికి తొలుత వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్‌ వైద్యుల బృందం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

ప్రీతి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటన

ప్రీతి మృతిపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ప్రీతి కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాను మరో రూ. 20 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తానని ప్రకటించారు. ప్రభుత్వపరంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయార్ రావు వెల్లడించారు. ఇది ఇలావుండగా, వరంగల్ ఎంజీఎం, కేఎంసీ వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ కూడా పోలీసులు భారీగా మోహరించారు. ప్రీతి స్వగ్రామంలో గ్రామస్థులు రహదారిపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు.

ప్రీతి మృతిపై కేసీఆర్, హరీశ్ రావు సంతాపం

ప్రీతి మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రీతి మరణం బాధాకరమని అన్నారు. విచారణ అనంతరం హెచ్ఓడీపై చర్యలు తీసుకుంటామని హరీశ్ రావు చెప్పారు. నిమ్స్ ఆస్పత్రికి వచ్చిన హరీశ్ రావు.. ప్రీతి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+