పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పశ్చిమ గోదావరిలో గ్యాస్ లీక్ కలకలం.. ఉలిక్కిపడ్డ జనం

|
Google Oneindia TeluguNews

పశ్చిమ గోదావరి జిల్లాలో గ్యాస్ లీకేజ్ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో గ్యాస్ లీకేజ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బోరుకు మరమ్మతులు చేస్తున్న సమయంలో భారీ శబ్దంతో గ్యాస్ లీక్ అయ్యింది . ఇక గ్యాస్ లీక్ కావటంతో ఏం ప్రమాదం జరుగుతుందో అన్న భయం గుప్పిట్లో స్థానికులు బిక్కుబిక్కుమన్నారు.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన కేసు విచారణ .. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యాలన్న హైకోర్టువిశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన కేసు విచారణ .. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యాలన్న హైకోర్టు

గ్యాస్ లీక్ గురించి తెలుసుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను అక్కడ నుండి పంపివేశారు. అప్రమత్తమైన అధికారులు గ్రామస్తులను కూడా అక్కడ నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా చెప్పారు. వేమవరంలో వ్యవసాయబోరుకు రిపేరు చేస్తుండగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.

Gas leak in West Godavari creates panic in public

ఇక ఈ వరుస గ్యాస్ లీక్ ఘటనల నేపధ్యంలో ఒక్కసారిగా కోస్తా ప్రాంతం ఉలిక్కిపడింది . వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, ఆ చుట్టపక్కల ఉన్న 5 గ్రామాల ప్రజలపై గ్యాస్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో తెలుసు . ఇప్పటికీ బాధిత గ్రామాల ప్రజలు ఇంకా కోలుకోలేదు . ఇక తాజా సంఘటనపై వెంటనే అప్రమత్తం అయిన అధికారులు గ్యాస్ లీకేజ్ ను కంట్రోల్ చేస్తున్నారు .

English summary
Gas leak at VemaVaram Achanta mandal. The gas is emitting loudly as it is repairing the farm borewell at Vemavaram. This causes the locals to panic. Upon receiving the information, the officers reached the scene and evacuated the locals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X