Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలీస్ శాఖలో అరుదైన సంఘటన .. బదిలీపై వెళ్తున్న పశ్చిమ గోదావరి ఎస్పీకి పోలీసుల ఘన వీడ్కోలు, వీడియో వైరల్

పశ్చిమగోదావరి జిల్లాలో పోలీస్ శాఖ లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఈరోజు జరిగిన సంఘటన జిల్లా వాసులందరిని ఆశ్చర్యానికి గురి చేసింది .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెవ్వర్ బిఫోర్ అన్న చందంగా పోలీస్ బాస్ కు గ్రాండ్ గా వీడ్కోలు పలికారు ఏలూరు పోలీసులు. పశ్చిమగోదావరి ఎస్పీగా పని చేసి తాజాగా బదిలీపై వెళ్తున్న కే. నారాయణ నాయక్ కు పోలీసులు ఇచ్చిన వీడ్కోలు ఆయనను ఉద్వేగానికి గురి చేసింది.

Recommended Video

    Viral Video : బదిలీపై వెళ్తున్న West Godavari ఎస్పీకి పోలీసుల ఘన వీడ్కోలు! || Oneindia Telugu
    అందరితో సూపర్ పోలీస్ అనిపించుకున్న పోలీస్ బాస్

    అందరితో సూపర్ పోలీస్ అనిపించుకున్న పోలీస్ బాస్

    పోలీస్ అధికారుల బదిలీలు సహజంగా జరుగుతూ ఉంటాయి. బదిలీ జరిగినప్పుడల్లా ఇతర ప్రాంతాలకు వెళ్లి విధి నిర్వహణలో తమవంతు పాత్ర పోషిస్తారు పోలీసులు. వారి పనితీరును బట్టి ఆయా జిల్లాల వాసులు, పోలీసు శాఖలో పనిచేసిన ఉద్యోగులు వారిని గుర్తుంచుకుంటారు. కానీ అంతకుమించి అందరి గుండెల్లో గూడు కట్టుకునే గొప్ప పోలీస్ బాస్ లు కూడా ఉంటారు అని కొందరు నిరూపిస్తారు. అలాంటి కోవకు చెందిన వారే పశ్చిమగోదావరి ఎస్పీగా పని చేసి తాజాగా బదిలీ అయిన కే నారాయణ నాయక్.

    పశ్చిమగోదావరి ఎస్పీ నారాయణ నాయక్ కు ఘన వీడ్కోలు

    పశ్చిమగోదావరి ఎస్పీ నారాయణ నాయక్ కు ఘన వీడ్కోలు

    విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తూ, లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణలో రాజీపడకుండా, సిబ్బంది కి ఏ సమస్య వచ్చినా తానున్నానంటూ అండగా ఉండి బాస్ అంటే ఇలా ఉండాలి అని అనిపించేలా తనదైన మార్క్ పాలన చేశారు పోలీస్ బాస్ నారాయణ నాయక్. ఇక తాజాగా ఆయన బదిలీ నేపథ్యంలో ఆయనకు ఊహించని విధంగా సెండాఫ్ ఇచ్చి తమ ప్రేమను చాటుకున్నారు పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది. బదిలీపై వెళ్తున్న ఎస్పీ నారాయణ నాయక్ కు డీఎస్పీలు , సిఐలు, ఎస్ఐలు అందరూ ఆయన వెళ్తున్న వాహనానికి పూలతో చక్కగా డెకరేట్ చేసి ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.

    ఆయన వాహనానికి తాళ్ళు కత్తి లాగుతూ పూలు చల్లుతూ పోలీసుల వీడ్కోలు

    ఆయన వాహనానికి తాళ్ళు కత్తి లాగుతూ పూలు చల్లుతూ పోలీసుల వీడ్కోలు


    ఆయన నిలుచున్న పోలీసు వాహనాన్ని తాళ్లతో లాగుతూ దారిపొడవునా పువ్వులను చల్లుతూ సాదరంగా వీడ్కోలు పలికారు. ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో తనకు వీడ్కోలు చెప్పిన అధికారులకు పేరుపేరునా కరచాలనం చేసి అందరికీ రెండు చేతులెత్తి నమస్కరించారు. తన పట్ల ఎంతో ప్రేమను చూపించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన నారాయణ నాయక్ చాలా ఎమోషనల్ అయ్యారు. జిల్లా ఎస్పీగా పనిచేసిన పదవీకాలం తనకు ఎంతో అమూల్యమైనదని పేర్కొన్న నారాయణ నాయక్ తనకు సహకరించిన ప్రతి పోలీస్ అధికారికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

    ఎమోషనల్ అయిన జిల్లా పోలీస్ బాస్ .. వీడియో వైరల్

    ఇదే సమయంలో కరోనా మహమ్మారి మొదటి, రెండు వేవ్ లను సమర్ధవంతంగా పోలీసు యంత్రాంగం ఎదుర్కొని, ప్రజలకు రక్షణగా నిలిచిందని కొనియాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించటం, నేరగాళ్ల విషయంలో ఎక్కడా రాజీ లేకుండా చర్యలు చేపట్టడం వంటి అనేక అంశాలను గుర్తుచేసి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రశంసించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొదటిసారి జిల్లా పోలీస్ బాస్ ఎస్పీ నారాయణ నాయక్ కి సెండాఫ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+