ఆస్ట్రేలియాలో తగ్గిన భారత విద్యార్థులు

దేశంలోని అంతర్జాతీయ విద్యారంగంలో గొడవలు, చట్టపరమైన మార్పులు, ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభంకూడా యూనివర్సిటీలలో విదేశీ విద్యార్థుల ప్రవేశం తగ్గడంపై ప్రభావం చూపిన అంశాలు అని మీడియా పేర్కొంది. 2008-09లో ఆస్ట్రేలియా విద్యారంగం 65,503 మంది భారతీయ పాస్‌పోర్టు గల వారికి విద్యార్థి వీసాలు జారీ చేయగా, 2009-10లో 29,721కి పడిపోయింది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినా దాడులు మాత్రం ఆగడం లేదు. భారతదేశం ఆస్ట్రేలియాతో పలుమార్లు చర్చలు కూడా జరిపింది. కానీ ఫలితం కనిపించడం లేదు. దీంతో ఆస్ట్రేలియాకు వెళ్లడానికి భారతీయ విద్యార్థులు భయపడుతున్నారు.












Click it and Unblock the Notifications