అన్నా హజారేకు ఎన్నారైల మద్దతు

Anna Hazare
అవినీతిపై పోరుకు దిగిన అన్నా హజారేకు ప్రవాస భారతీయులు కూడా మద్దతు పలుకుతున్నారు. అమెరికాలోని పలు నగరాలలోనూ హజారే దీక్షకు మద్దతు పలికేందుకు వివిధ ప్రవాస భారతీయ సంఘాల నడుం బిగించాయి. భారత్‌లో పెరిగిపోతున్న అవినీతిని వ్యతిరేకిస్తూ 240 మైళ్ల మేర పాదయాత్రను నిర్వహించిన దండి మార్చ్‌-IIగ్రూపు వారు హజారేకు సంఘీభావంగా శుక్రవారం రాత్రి నుంచి ఒకరోజు నిరాహార దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. లాస్‌ఏంజిల్స్‌ వేదికగా ప్రారంభమమ్యే ఈ దీక్ష 9వ తేదీ (శనివారం) సాయంత్రంతో ముగుస్తుందని శశిధర్‌ కలగార చెప్పారు.

నిరశన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనేందుకు ఇప్పటికే చాలా మంది ప్రవాస భారతీయులు ఉత్సుకతతో ఉన్నారని ఆయన తెలిపారు. 'భారత బంగారు భవిత కోసం ఉద్యమించాల్సిన తరుణం అసన్నమైంది. ఈ సమయంలో ప్రతి భారతీయుడు ఎక్కడ ఉన్నా స్పందించి అవినీతి భూతాన్ని అంతం చేసేందుకు ముందుకు రావాలి' అని ఆయన కోరారు. మార్చి 12-26 మధ్యకాలంలో భారత్‌లో అవినీతికి వ్యతిరేకంగా అమెరికాలోని 14 మహా నగరాలలో 240 మైళ్ల మేర చేపట్టిన దండి మార్చ్‌II కార్యక్రమానికి మాదిరిగానే ఈ కార్యక్రమానికి కూడా అద్భుత స్పందన వస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+