‘2011 మిస్ ఇండియా - కెనడా’గా టోరంటో బాలిక

కాక్ టెయిల్స్, డిన్నర్, డ్యాన్స్ మొదలైన వాటితో ఈ వేడుక నాల్గు గంటల పాటు సాగింది. పోటీలు, ఇండియన్ డ్రస్, ఈవెనింగ్ గౌన్, టేలంట్ మొదలగు అంశాలలో నిర్వహించబడ్డాయి. ఈ అంశాల తర్వాత ప్రశ్నలు, జవాబుల కార్యక్రమం సాగింది. 19 ఏళ్ళ అఖినా మూకెన్ చివరగా మిస్ ఇండియా - కెనడా క్రౌన్ అలంకరించబడింది. ఈమెకు ఇతర అవార్డులే కాక ఇండియాకు ఒక ఉచిత ట్రిప్ కూడా బహుకరించారు. అందాల సుందరి కిరీటాన్ని మూకెన్ కు పెడుతూ, ఆమె కెనడా, ఇండియాలలోని వివిధ సామాజిక సంస్ధలతో పని చేయగలదని తాను ఆశిస్తున్నట్లు ఈవెంట్ ఆర్గనైజర్ సంజయ్ అగ్నిహోత్రి తెలిపారు.
మిస్ ఇండియా - కెనడా అందాల సుందరి పోటీని దివంగత పంజాబి బిజినెస్ మాన్ ఖుష్ అగ్నిహోత్రి గతంలో ఆరంభించగా నేడు అది నార్త్ అమెరికాలో ఒక పెద్ద వేడుకగా చేయబడుతోంది.












Click it and Unblock the Notifications