డల్లాస్‌లో ఉగాది ఉత్సవాలు

NRI
అమెరికాలోని డల్లాస్‌లో ప్రవాసాంధ్రులు శ్రీఖర నామ ఉగాది ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, విందు భోజనం, తెలుదనం ఉట్టిపడేట్లు పరిసరాల అలంకరణ, పన్నీటి పుష్పాలు మాతృభూమికి దూరమైన లోటును పూరించాయి. విజయ చంద్రహాస్ మద్దుకూరి, సమీర ఇల్లెందుల కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

టాంటెక్స్ సాంస్కృతిక కార్యదర్శి ఆధ్వర్వంలో శాస్త్రీయ నృత్యాలు, చిత్ర సంగీత మిశ్రమ నాట్య విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. దాదాపు 900 మందికి పైగా వచ్చిన వారికి చిలుకూరి సాదర స్వాగతం పలికారు. వేద పండితులు సాంబశివ శర్మ ప్రత్యేక పంచాంగ పఠనం తెలుగువారికి రాశిఫలాలను అందించింది.

టాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు గీత దమ్మన్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సభ్యులకు, డల్లాస్ ప్రాంత తెలుగువారికి నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. జులై 8,9 తేదీల్లో డల్లాస్ నగరం కేంద్రంలోని బ్లాక్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ర్స్ అండ్ లెటర్స్‌లో జరిగే సంఘం రజతోత్సవ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఉగాది వేడులక సందర్భంగా ప్రదర్శించిన ఉగాది విందు, పద్మవ్యూహం నాటికలను ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి.

దశాబ్దానికి పైగా ఉత్తర అమెరికాలో సంగీత సాహిత్య విజ్ఞాన వినోదాలను అందిస్తూ విజయవంతంగా నడుస్తున్న ఏకైక తెలుగు రేడియో, తరాల అంతరాలను రూపుమాపే సంగీత తరంగిణి, గానసుధ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యాఖ్యాతగా సేవలందిస్తూ తెలుగు భాషా సంస్కృతీ సంప్రదాయాల పురోభివృద్ధికి చేయూతనిస్తున్న 18 మందిని పాలక మండలి అధిపతి శ్రీధర్ కోడెల, గీత దమ్మన్న సన్మానించారు. టాంటెక్స్ కార్యవర్గ సభ్యుల హోదాలో విశేష సేవలందించిన రవీంద్ర పండిట్‌ను టాంటెక్స్ పూర్వాధ్యక్షుడు చంద్ర కన్నెగంటి, శ్రీధర్ కోడెల, గీత దమ్మన్న సన్మానించారు. ఉగాది కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన రామకృష్ణ కోరాడ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+