హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నార్వే గొడవ: పిల్లలకు వాతలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Norway child row: Indian couple burnt son, claims police
ఓస్లో: పిల్లలను మందలించారనే ఆరోపణలతో జైలు పాలైన నార్వేలోని తెలుగు దంపతుల కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఆ దంపతులు తమ కుమారుడి ఒంటిని కాల్చారని పోలీసులు ఆరోపిస్తున్నారు. దీంతో కేసు కొత్త మలుపు తిరిగింది. తమ ఏడేళ్ల కుమారుడికి వారు వాతలు పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. పిల్లవాడి ఒంటిపై కాల్చిన మరకలు, మచ్చలు ఉన్నాయని, బెల్టుతో కొట్టారని ఓస్లో పోలీసు శాఖ ప్రాసిక్యూషన్ అధిపతి కుర్ట్ లిర్ ఆరోపించారు.

కాల్పిన లోహంతో వాతలు పెట్టారని ఆ తెలుగు దంపతులు ఆరోపణలు ఎదుర్కుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ ఆరోపణలను తెలుగు దంపతులు చంద్రశేఖర్ వల్లభనేని, అనుపమ ఖండిస్తున్నారు. పిల్లలను వారు బాధించలేదని, పిల్లవాడి పట్ల సరిగా వ్యవహరించి ఉండకపోవచ్చు గానీ బాధించలేదని, సహాయం కోసం వారు చూశారని, కానీ అది లభించలేదని అనుపమ తరఫు న్యాయవాది మార్టే బ్రోట్రోమ్ అన్నారు.

దంపతులను నార్వేలోని జైలులో పెట్టడం తప్పు అని ఆమె అన్నారు. కోర్టు వారికి శిక్ష వేస్తే తాము అపీల్ చేస్తామని ఆమె అన్నారు. పిల్లవాడు పాఠశాల ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసిన తొమ్మిది నెలల తర్వాత పోలీసులు చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. కొడుకుని మందలించిన కేసులో తల్లి అనుపమకు 15 నెలలు, తండ్రి చంద్రశేఖర్‌కు 18 నెలలు జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరింది.

చంద్రశేఖర్, అనుపమ దంపతులు పిల్లల పట్ల దురుసుగా వ్యవహరించడం తరుచుగా చేస్తున్నారని, ఇదే మొదటి సారి కాదని పోలీసులు అంటున్నారు. కాగా, తెలుగు దంపతులపై కోర్టు ఏ విధమైన తీర్పు వెలువరిస్తుందనేది ఉత్కంఠగా మారింది.

English summary
Even as an Oslo court on Tuesday is due to rule in the case of an Indian couple arrested for allegedly abusing their child, the Norway police claimed that they burnt and hit their seven-year-old son, reports said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X