దాడులు: భారత సైనికులు మృతి
జుబా: దక్షిణ సూడాన్‌లో ఇటీవల నెలకొన్న సైనిక కుట్ర ఫలితంగా దేశంలోని రెండు వర్గాలమధ్య భీకర పోరులో జరుగుతోందని, ఇప్పటి వరకు సుమారు ఐదు వందలమంది బలయ్యారని ఐక్యరాజ్య సమితి శాంతిరక్షక దళాలు పేర్కొన్నాయి. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపింది. కాగా గురువారం తిరుగుబాటుదారులు ఐక్యరాజ్య సమితి స్థావరంపై జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించారు.
దక్షిణ సూడాన్ దేశంలో శాంతి నెలకొల్పేందుకు ఐక్యరాజ్య సమితి శాంతిరక్షక దళం తరపున విధులు నిర్వహిస్తున్న ముగ్గరు భారత సైనికులు తిరుగుబాటుదారుల దాడిలో గురువారం ఉదయం మరణించారని భారత తరపున ఐక్యరాజ్య సమితి (ఐరాస) రాయబారి అశోక్ ముఖర్జీ మీడియాకు తెలిపారు. దక్షిణ సూడాన్ దేశంలో రెండో అతిపెద్ద వర్గమైన నూర్ దళాలు, జొంగ్లేయి రాష్ట్రంలోని అకోబోలో మరో వర్గమైన దింకాలపై దాడికి పాల్పడ్డారని, ఆ దాడిలో భారతీయ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

ఐక్యరాజ్య సమితి పోలీస్ అడ్వైజర్, ఇద్దరు పౌరులతో ఉన్న 43 మంది భారత శాంతిరక్షక దళాలపై సుమారు 1500 నుంచి 2వేల మంది తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డట్లు ఆయన తెలిపారు. సుమారు 30మంది సూడనీయులు తమ శిబిరంలో తలదాచుకున్నారని దక్షిణ సూడాన్‌లో యూనైటెడ్ నేషన్స్ మిషన్ పేర్కొంది. తిరుగుబాటుదుదారుల దాడిని మిషన్ తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ దక్షిణ సూడాన్ నెలకొన్న సంక్షోభం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
మానవ హక్కులు హరించబడుతున్నాయని, వర్గపోరులో అనేక మంది పౌరులు మృత్యవాతపడుతున్నారని తెలిపారు. ఆదివారం రాత్రి మొదలైన ఈ ఘర్షణలలో సుమారు 500 మంది మరణించగా, మరో 800 మంది గాయపడినట్లు ఐక్యరాజ్య సమితి ఆర్మీ అధికారి ఒకరు పేర్కొన్నారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన పౌరులు వేలాదిగా ఐరాస శిబిరాలకు పరుగులు తీశారు.
సూడాన్‌లో దశాబ్దాలపాటు అంతర్యుద్ధం సాగిన తర్వాత రిఫరెండం ద్వారా 2011లో 'దక్షిణ సూడాన్' ప్రత్యేక దేశంగా అవతరించింది. ఈ నేపథ్యంలో జులైలో పదవీచ్యుతుడైన ఉపాధ్యక్షుడు రీక్ మాచర్ అనుకూల సైనికులు ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర పన్నారని అధ్యక్షుడు సల్వా కీర్ ఆరోపించారు. దీనిని మాచర్ ఖండించారు. దీంతో రెండు వర్గాల మధ్య దాడులు చేసుకుంటున్నాయి. కాగా తిరుగుబాటుదారుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications