ATA Beauty Pageant:మెరిసిన రౌడీబాయ్..విజయ్ దేవరకొండ చేతుల మీదుగా కిరీటం..!
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఘనంగా నిర్వహించిన బ్యూటీ పేజెంట్ 2024 గ్రాండ్ ఫినాలే ముగిసింది. మొత్తం ఐదు కేటగిరీలో ఈ అందాల పోటీలు జరిగాయి. మిస్ టీన్, మిస్, మిసస్, మిస్టర్ టీన్, మిస్టర్ ఇలా ఐదు విభాగాల్లో ఈ అందాల పోటీలను నిర్వహించారు. అమెరికా తెలుగు అసోసియేషన్ చరిత్రలో ఇలాంటి ఒక కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. అమెరికా దేశవ్యాప్తంగా ఈ పోటీలను నిర్వహించారు.
అమెరికాలోని 10 నగరాలు అట్లాంటా, నాష్‌విలే, వాషింగ్టన్ డీసీ, డాలస్,షికాగో, న్యూజెర్సీ, షార్లట్,రాలే,ఆస్టిన్, ఫిలడెల్ఫియాలలో సెమీ ఫైనల్స్ నిర్వహించారు.వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఒకే వేదికపైకి వచ్చి కనువిందు చేశారు.ఎత్నిక్, టాలెంట్ మరియు వెస్ట్రన్ అనే మూడు అట్రాక్టివ్ రౌండ్స్‌ను సెమీఫైనల్స్‌లో నిర్వహించారు. ఈ మూడు రౌండ్లలో పోటీదారులు తమ విభిన్న ప్రతిభను సంస్కృతిని ప్రదర్శించారు.

ఆటా నేషనల్ బ్యూటీ పేజెంట్ ఫినాలేలో పాల్గొనేందుకు అమెరికా దేశవ్యాప్తంగా 80 మంది విజేతలు, రన్నర్స్ అప్‌కు ఆహ్వానం అందింది. జూన్ 8వ తేదీన GWCCలోని సిగ్నియా బాల్‌రూం వేదికగా జరిగిన ఈ ఫినాలేలో పోటీదారులకు రెండు రౌండ్లు నిర్వహించారు. టాప్ ఫైవ్‌లో నిలిచిన ఫైనలిస్టులకు ముందుగా ఎత్నిక్ రౌండ్ ఆ తర్వాత పోటీదారుల పరిచయం, అనంతరం వెస్ట్రన్‌తో పాటు ప్రశ్నలు సమాధానాల కార్యక్రమం నిర్వహించారు.

ఇక ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా బిగ్‌బాస్ కౌశల్ మంద,ప్రద్యుమ్న రెడ్డి, కార్తీక్ హర్షివ్,అమెలియాలు వ్యవహరించారు. అంతకుముందు అనూప్ రూబెన్స్ సంగీత విభావరి జరిగింది. ఈ కార్యక్రమంలో ఆట కన్వెన్షన్ కన్వీనర్ కిరణ్ రెడ్డి పాశం, కన్వెన్షన్ అడ్వైజర్ గౌతమ్ గోలి,అధ్యక్షులు జయంత్ చెల్లాతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

జూన్ 9వ తేదీన సాయంత్రం క్రౌనింగ్ సెరెమొనీ జరిగింది.రన్నరప్స్‌ను యూత్ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ నేహా శెట్టిలు కిరీటం అందజేశారు.ఇక విజేతగా నిలిచిన వారిని రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కిరీటాన్ని అందజేశారు.మొత్తానికి ఆట బ్యూటీ పేజెంట్ 2024 టాలెంట్‌నే కాకుండా... భిన్న సంస్కృతులను ప్రమోట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.













Click it and Unblock the Notifications