NRI News: తెలుగు అసోషియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలు..

తెలుగు అసోషియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో తాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహంచారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 6 వరకు ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీలను ఓస్టర్లీ స్పోర్ట్స్ అండ్ అథ్లెంటిక్ సెంటర్, ఐల్ వర్త్, లండన్(వెస్ట్) లో ఘనంగా జరిగాయి. లండన్, పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చూశారు. ఈ క్రీడా కార్యక్రమంలో 250 మందికి పైగా మెన్స్ డబుల్స్, మెన్స్ 40 ప్లస్ డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్, కిడ్స్ అండర్ 16 లాంటి అనేక విభాగాల్లో పాల్గొన్నారు. ప్రముఖ తెలుగు హాస్యనటుడు అలీ పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందించారు.

పోటీల్లో పాల్గొన్న వారిని అభినందించారు. అవార్డుల ప్రదానోత్సవంలో రవి సబ్బ(ఛైర్మన్), కప్పెట కిరణ్ (వైస్ ఛైర్మన్) పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వాలంటీర్స్, క్రీడాకారులు, కార్యకర్తలు సుదాకర్ గుబ్బల (కోర్ టీమ్), బాలాజీ కల్లూరు (కోర్ టీమ్), అనిల్ రెడ్డి (కోర్ టీమ్), రాజేష్ వీరమాచనేని, రాజేష్ తోలేటి (టీఏఎల్ మాజీ వైస్ చైర్మన్ /కోశాధికారి), వెంకట్ నీల, (ట్రస్టీ - నిధుల సేకరణ), అనిల్ అనంతుల (ట్రస్టీ - మెంబర్షిప్ & ట్రెజరర్), రాయ్ బొప్పన (ఐటీ ఇన్చార్జ్) కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.

Badminton competitions were organized under the aegis of Telugu Association of London

బాలికలు డబుల్స్ అండర్ 16 విభాగంలో ప్రథమ బహుమతి సుస్మిత & జిత్య అందుకున్నారు. ద్వితీయ బహుమతి ప్రజ్ఞా మూల & సహస్ర మీనావళి పొందారు.
బాలురు డబుల్స్ అండర్ 16 విభాగంలో విష్ణు బండారి & దృప్రీత్ పాతూరి మొదటి బహుమతి పొందగా.. వేపాడ సంజీవ్ & వేపాడ శ్రీ సాయి చరణ్ రెండో బహుమతి అందుకున్నారు. మహిళల డబుల్స్ లో మొదటి బహుమతి పూజిత మోహన్ & చుకారియా జ్యోత్స్న అందుకోగా.. రెండో బహుమతి స్మిత రెడ్డి & గీతిక పొందారు.

మహిళలు 35 ప్లస్ సంవత్సరాల విభాగంలో పల్లవి పవన్ & వాసవి వంశీ మొదటి బహుమతి పొందారు. మిశ్రమ డబుల్స్ విభాగంలో మనోభి రామ్ & జ్యోత్స్న నీ మొదటి బహుమతి పొందగా.. రాధిక కాంతారెడ్డి & శ్వేతా కాంతారెడ్డి రెండో బహుమతి గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+