• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నాటా ద్వివార్షిక సమావేశానికి విరాళం

By Pratap
|

డాలస్/ఫోర్ట్ వర్త్: అట్టహాసంగా నాటా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) వారి కార్యవర్గ సమావేశం అమెరికా లోని డల్లాస్ నగరంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సమావేశానికి 300 మందికి పైగా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. డల్లాస్ ప్రాంత ఉపాధ్యక్షులు జయచంద్ర రెడ్డి నాట కార్యవరాన్ని స్వాగతించారు. డల్లాస్ లో సభని నిర్వహంచడం అదృష్టంగా భావించారు.

ఈ సమావేశానికి వివిధ రంగాల్లో ఉన్న తెలుగు ప్రముఖులు పాల్గొని వారి భావాలను వ్యక్త పరిచారు. సమావేశాన్ని ప్రారంభిస్తూ అధ్యక్షులు డాక్టర్ సంజీవ రెడ్డి ప్రసంగించారు. పాలక మండలి అధ్యక్షులు డాక్టర్ ప్రేమ రెడ్డి సభ్యులను స్వాగతిస్తూ నాటా ఆశయాలను వివరించారు. నాటా చేస్తున్న సహాయ కార్యక్రమాలను అభినందిచారు.

Dallas Telugu community raises funds for NATA Atlanta convention

డాక్టర్ మల్ల రెడ్డి పైళ్ల (పాలక మండలి సభ్యులు) మాట్లాడుతూ - నాటాన విశ్వాసం, సేవ దృక్పథంతో ఏర్పడిందని చెప్పారు. ఐక్యత, సుహృద్బావం నాటా కార్యవర్గ సభ్యుల ఆస్తి అని తెలిపారు. నాటా కార్యదర్శి శ్రీ. రామసుర్య రెడ్డి సభా కార్యకలాపాలు నిర్వహించారు. కొశాధికారి శ్రీ. శ్రీనివాస్ అనుగుల ఆర్ధిక స్తితిగతులు తెలిపారు.

తదుపరి స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ ఉపాధ్యక్షులు వారివారి నవీకరణలను తెలిపారు. అధ్యక్షులు సంజీవ రెడ్డి సభని ఉద్దేశిస్తూ ఆంధ్ర ప్రదేశలో ఇటివలే ముగించుకున్న నాటా సేవా కార్యక్రామాల గురించి వివరించారు. అట్లాంటా లో జరగనున్న 2014 నాట ద్వివార్షిక సమావేశాకర్త బాల ఇందుర్తి, సమన్వయకర్త శ్రీని వంగిమల్ల ప్రసంగిస్తూ నభూతో న భవిష్యత్‌గా అవతరిస్తోందని వివరించారు. వీరు డల్లాస్ లో నివసిస్తున్న తెలుగు వారిని అట్లాంటా లో జరగబోయే నాటా సమావేశానికి హృదయపూర్వకంగా ఆహ్వానించారు.

మధ్యాహ్న సమావేశంలో పలు కీలక నిర్ణయాలు జరిగాయి, అందులో భాగంగా డాక్టర్ మోహన్ మల్లం ఉత్తరాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. తదుపరి క్రమంలో శ్రీ. రాజేశ్వర్ గంగసాని మరియు డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల వరుసగా ఉత్తరాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రామాలతో పాటు విరాళలు కూడా చేకూర్చడం జరిగింది. అందరి అంచనాలు మించుతూ 2 లక్షల 50 వేల డాల్లర్లు సేకరించారు.

జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ - డల్లాస్‌లో నాటా జట్టుని వేదిక పైకి ఆహ్వానించారు. వీరిలో డాక్టర్ రమణ రెడ్డి గూడూరు, శ్రీ. రామ సూర్య రెడ్డి, డాక్టర్ శ్రీధర్ రెడ్డి కోర్సపాటి, రమణ పుట్లూరు, రమణ రెడ్డి క్రిస్తాపాటి, మహేష్ ఆదిభట్ల, ప్రతాప్ రెడ్డి భీమిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఆళ్ళ, మహేందర్ రెడ్డి కామిరెడ్డి, రాజేందర్ తోడిగల, ఫాల్గుణ్ రెడ్డి, వాణి గజ్జల, శ్రీ. సుధాకర్ రెడ్డి, రవి కోన, కృష్ణా రెడ్డి కోడూరు, రఘు గజ్జల, శ్రీ. మహేష్ గూడూరు, సతీష్ రెడ్డి బొమ్మినేని ఉన్నారు.

శ్రీదేవి తేనేపల్లి ఆద్వర్యంలో సాంస్కృతిక కార్యక్రామాలు ఆద్యంతం ప్రేక్షకులను అలరించాయి. రాజేశ్వరి ఉదయగిరి వ్యాఖాతగా వ్వ్యవహరించారు. జయ కల్యాణి, జ్యోతి సాధూ, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆళ్ళ, శ్రీ. చక్రపాణి తదితరాల పాటలు తన్మయత్వాన్ని గురిచేశాయి. ప్రాంతీయ తెలుగు సంఘం ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు విజయమోహన్ కాకర్ల, వారి కార్యవర్గ సభ్యులు నాట నాయకులని పుష్ప గుచ్చాలతో మరియు దుశాలువలతో సన్మానించారు. జయచంద్ర రెడ్డి వందన సమర్పణ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As the NATA biennial convention is within the sight their leaders notched up a level in raising funds for its upcoming glamorous event. The NATA team assembled in Dallas, TX between Feb. 28th and March2st for their board meeting. The meeting held in multiple locations in Dallas, showing the true flair of Texas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more