బిజెపి విజయం: ఎన్నారైలకు విజయ్ రూపానీ ఫోన్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూ జెర్సీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించినదుకు ఆమెరికాలో ఎన్నారైలు విజయ్ దివస్ వేడుకలు జరుపుకున్నారు న్యూజెర్సీలో అఫ్ బీజేపీ జాతీయ అధ్యక్షులు, శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల మాట్లాడుతూ - ప్రస్తుతం బీజేపీ, ఎన్డీఏ కూటమి యావత్ భారత దేశం లోని 29 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాల్లను పాలిస్తుందని తెలిపారు.

ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో, బీజేపీ ఘన విజయంలో, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ నిర్వహించిన కీలక పాత్రను గురించి వివరించారు. ఈ సందర్భంగా అఫ్ బీజేపీ అనేక మంది కార్యకర్తలు కృష్ణా రెడ్డి, వాసుదేవ్ పటేల్ ఆధ్వర్యంలో గుజరాత్ వెళ్లి అక్కడ ప్రచారం చేశారు.

Gujarat assembly elctions: Vijay Diwas celebrated in USA

వాషింగ్టన్ డీసీలో అఫ్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ అడపా ప్రసాద్ మాట్లాడుతూ- ఓట్ల సరళి, వోటింగ్ శాతం పెరిగిన విధానాన్ని వివరించారు. అదేవిధంగా వరసగా ఆరవ సారి గెలిచినందుకు గుజరాత్ ప్రజలకు, మోదీ గార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ -
తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ లో కూడా బలోపితం కావడానికి అఫ్ బీజేపీ పని చేస్తుందని అన్నారు

అఫ్ బీజేపీ మీడియా కో-కన్వీనర్ శ్రీ దిగంబర్ ఇస్లాంపురే మరియు దీప్ భట్ మాట్లాడుతూ అఫ్ బీజేపీ చేప్పట్టిన టెలీఫోనిక్ మరియు సోషల్ మీడియా ప్రచారాల ఫలితాలను వివరించారు.

Gujarat assembly elctions: Vijay Diwas celebrated in USA

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ప్రతేకంగా ఫోన్ చేసి విజయోస్తవాల్లో పాల్గొన్న ప్రవాస భారతీయులకు, ఎన్నికల్లో విశేషంగా కృషి చేసిన అఫ్-బీజేపీ టీమ్‌కి ప్రతేక ధన్యవాదాలు తెలిపారు.

టంపా (ఫ్లోరిడా ), డల్లాస్ , హౌస్టన్ (టెక్సాస్ ) , కాలిఫోర్నియా , చికాగో లో విజయ్ దివస్ సంబరాలు జరిగాయి. తరువాత, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ మాజీ అధ్యక్షులు, జయేష్ పటేల్ , సురేష్ జానీ ఎచ్ ఆర్ షాహ, అలాగే సీనియర్ నేతలు ఆత్మ సింగ్ , బాల గురు , ప్రమోద్ భగత్ ప్రసంగించి ఈ ఎన్నికల విజయాల ప్రాముఖ్యతను తెలిపారు.

Gujarat assembly elctions: Vijay Diwas celebrated in USA

ఈ సంబరాల్లో ఓఎఫ్ బిజెపీ జాతీయ సెక్రటరీ మధు బెల్లం, రఘువీర్ రెడ్డి, కల్పన శుక్ల, ఆనంద్ జైన్ , పార్తీబన్, శ్రీకాంత్ రెడ్డి , ఇతర ఓఎఫ్ బిజెపీ నేతలు గుంజన్ మిశ్ర, వంశీ యంజాల, సుబ్రహ్మణ్యం వేమూరి ,సతీష్ , లక్ష్మీనారాయణ పెరి , సత్య షా , అచలేష్ అమర్ ,యామీర్ భట్ , డాక్టర్ జయరాం గుంటపాళీ, డాక్టర్ బిమల్ తలాటి, అమర్ ఉపాధ్యాయ్, దినేష్ , విలాస్ ఇంకా ఇతర సంఘల నాయకులు పాల్గొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
OFBJP in USA held “Vijay Diwas” celebrating BJP victories in Gujarat and Himachal Pradesh state elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి