గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవాన్ని గల్ఫ్ దేశాలలోని తెలుగు సంఘాలన్ని కలిసి భారీగా నిర్వహించాయి. 1888 సెప్టెంబరు 5న జన్మించిన భారత తొలి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము.

Gulf Telugu Sanghala Samakhya Teachers day celebrations

గల్ఫ్ దేశాలలోని వివిధ పాటశాలల్లో రక రకాల సబ్జెక్టులను భోదిస్తున్న వివిధ అధ్యాపకులు మరియు తెలుగు, భగవత్ గీత లాంటి వివిధ అంశాలను భోదిస్తున్న ఉపాధ్యాయులు 75 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమం పూర్తిగా వర్చువల్ పద్దతిలో జూమ్ ద్వారా జరిగినది.

 Gulf Telugu Sanghala Samakhya Teachers day celebrations

ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగా వెంకప్ప భాగవతుల వ్యవహరించగా వివిధ దేశాలలోని ఉపాధ్యాయులను సభకు పరిచయం చేసే కార్యక్రమాన్ని కువైట్ నుండి సుధాకర రావు, ఖతార్ నుండి శ్రీసుధ, శిరీష, బహరైన్ నుండి జగదిష్, ఫుజైరియా నుండి మంజుల, అబు ధాబి నుండి విజయ ప్రసాద్, ఓమన్ నుండి చైతన్య సూరపనేని, అరుందతి, శ్రీదేవి నిర్వహించారు. గల్ఫ్ దేశాలలోని ఉపాద్యాయులు ప్రసంగించి తమ తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు. అలాగే ఈ కార్యక్రమములో పాల్గొన్న ఉపాధ్యయులందరిని అభినందిస్తూ ప్రశంశా పత్రాన్ని అందచేశారు.

ఈ సందర్భముగా కార్యక్రమ నిర్వాహకులు సుధాకర రావు మాట్లాడుతూ.. ఇలా మొట్టమొదటి సారి మన గల్ఫ్ దేశాలోని ఉపాధ్యాయులను తెలుగు సంఘాలన్ని కలిసి సన్మానించుకోవటం చాలా ఆనందముగా వుందని, ఈ కార్యక్రమములో భాగస్వాములైన తెలుగు సంఘాల అధ్యక్షులు తెలుగు కళా సమితి బహరైన్ శివ ఎల్లపు కి, తెలుగు కళా సమితి ఓమన్ అని కుమార్ కి, ఆంధ్ర కళా వేదిక ఖతార్ సత్యనారయణ కి, సౌది తెలుగు అసోసియెషన్ దీపిక రావి కి, తెలుగు తరంగిణి వెంకట సురేష్ కి, తెలుగు కళా స్రవంతి ప్రుథ్విరాజ్ కి, ఫుజైరాహ్ తెలుగు కుటుంబాలు వేద మూర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేశారు.

 Gulf Telugu Sanghala Samakhya Teachers day celebrations

అలాగే సుధాకర రావు మాట్లాడుతూ.. ముందుగా కన్న తల్లిదండ్రులకూ, మనకి చిన్నప్పటి నుంచి విద్యాబుద్దులు నేర్పిన గురువులకు, మన వృత్తిలో మనకి అన్నివిధాల సలహాలు సూచనలు ఇచ్చిన మన పై అధికారులకు, అన్నింటిలోను మనల్ని తీర్చిదిద్దే మన జీవిత సహ ధర్మచారిణి మన జీవిత భాగస్వామికి మనం ఎప్పుడూ ఋణపడి వుంటాము అన్నారు. వారందరికీ శిరస్సు వంచి పాధాభివందనం చేస్తున్నాను అన్నారు. ఈ డిజిటల్ కార్యక్రమానికి సాంకేతిక సహకారాన్ని విక్రం సుఖవాసి అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+