మహిళ పట్ల అసభ్య ప్రవర్తన: ఎన్నారైకి జైలు
దుబాయ్: సహోద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఓ భారతీయ ఉద్యోగికి అక్కడి న్యాయస్థానం మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ దుబాయ్ కోర్టు తీర్పు వెలువరించింది. ఆర్థిక విశ్లేషకుడిగా విధులు నిర్వహిస్తున్న కెకె (40), ఆఫీస్ ఎలివేటర్‌గా పనిచేస్తున్న అతని సహోద్యోగిని(27)పై గత నవంబర్ నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.
గత మార్చిలో కోర్టు ప్రొసీడింగ్స్‌లో నిందితుడు తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుకు తెలిపాడు. ఆమెతో ఎప్పుడూ మర్యాద పూర్వకంగానే మాట్లాడానని చెప్పాడు. అయితే తాను వెళ్లే ముందే ఎలివేటర్ నుంచి ఆమెను వెళ్లాలని కోరినట్లు తెలిపాడు.

తనకు స్త్రీలంటే చాలా గౌరవమని నిందితుడు కెకె చెప్పాడు. అయితే టీ విరామ సమయంలోనూ ఆ మహిళను వేధింపులకు గురి చేసేవాడని నిందితుడిపై ప్రాసిక్యూటర్స్ కోర్టుకు తెలిపారు. తాను క్యాంటీన్‌లో ఉన్న సమయాల్లోనూ తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని బాధితురాలు కోర్టుకు తెలిపింది.
తన పట్ల నిందితుడు అసభ్యంగా ప్రవర్తించడంతో తాను సంస్థ అసిస్టెంట్ మేనేజర్, మానవ వనరుల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. రెండు వారాలైనా నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాను పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు చెప్పింది. కాగా, తాను క్యాంటిన్‌లో అనుకోకుండా ఆమెను తాకినట్లు కెకె తనతో చెప్పాడని సంస్థ అసిస్టెంట్ మేనేజర్ తెలిపారు.












Click it and Unblock the Notifications