ప్రయాణికురాలికి ముద్దుపెట్టిన కేసులో ఎన్నారైకి జైలు
గత సెప్టెంబర్‌లో దేవేందర్ సింగ్ హుస్టన్ నుంచి నెవార్క్‌కు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో తన పక్కనే కూర్చున్న మహిళకు ముద్దు పెట్టాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో నిద్ర నుంచి మేల్కొన్న సదరు మహిళ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది.
వెంటనే ఆ మహిళ విమానంలోని సిబ్బంది వద్దకు వెళ్లి దేవేందర్‌పై ఫిర్యాదు చేసింది. దీనిపై సిబ్బంది ఎయిర్ పోర్టుకు సమాచారం అందించడంతో విమానం ఎయిర్పోర్ట్ చేరగానే పోలీసులు దేవేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
ఆ కేసు శుక్రవారం (అక్టోబర్ 24)న విచారణకు వచ్చింది. కేసులో వాదనలను విన్న న్యాయమూర్తి.. దేవేందర్ సింగ్‌కు ఎనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. రెండేళ్లపాటు పోలీసుల పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించింది. దేవేందర్ సింగ్ లూసియానాలోని బోటన్ రూగ్లో నివాసముంటున్నాడు.